
ముంబైలోని మురికివాడకు చెందిన ఓ కుర్రాడు ఇంటర్నేషనల్ రేంజ్ బాక్సర్‌గా ఎలా ఎదిగాడనే కాన్సెప్ట్‌తో విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ తీస్తున్న సినిమా ‘లైగర్’. షూటింగ్ చివరిదశకు చేరుకుంది. లాస్ట్ షెడ్యూల్‌ను నిన్న ముంబైలో స్టార్ట్ చేశారు. విజయ్‌తో పాటు మెయిన్ యాక్టర్స్ అందరూ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. ‘లాస్ట్ లెగ్ ఆఫ్ ‘లైగర్’ షెడ్యూల్’ అంటూ ఈ విషయాన్ని నిర్మాతల్లో ఒకరైన చార్మి ట్వీట్ చేసింది. హీరోల్ని ఎంతో పవర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేసే పూరి.. విజయ్‌ను బీస్ట్ లుక్‌లో చూపించబోతున్నాడు. అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌కి తల్లిగా రమ్యకృష్ణ, కోచ్‌గా రోనిత్ రాయ్ నటిస్తున్నారు. విషురెడ్డి, అలీ, మకరంద్ దేశ్‌పాండే ఇతర పాత్రలు పోషిస్తున్నారు. బాక్సింగ్ మాజీ చాంపియన్ మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. థాయిలాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్సులు కంపోజ్ చేస్తున్నారు. కరణ్ జోహార్‌తో కలిసి పూరి జగన్నాథ్, చార్మి నిర్మిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆగస్టు 25న సినిమా విడుదల కానుంది.