బత్తుల పవన్ కళ్యాణ్ హీరోగా వీరు వులవల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పురుష:’. బత్తుల కోటేశ్వరరావు నిర్మించారు. హాసిని సుధీర్, రాయంచ, విషిక హీరోయిన్స్‌గా నటించగా, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాను మే 22న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘ఇదొక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ . సమ్మర్‌లో అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. నిర్మాతగా మా నాన్నగారు అన్ని విధాలా సపోర్ట్ చేశారు’ అని చెప్పాడు.
ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు హీరోయిన్స్ థ్యాంక్స్ చెప్పారు. డైరెక్టర్ వీరు వులవల మాట్లాడుతూ ‘నేను మళ్లీరావా, జెర్సీ, మసూద చిత్రాలకు పని చేశాను. ఈ కథని ఎలా అనుకున్నానో అలానే తీయగలిగాను. సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ అవుతోన్న మా చిత్రాన్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా’ అని అన్నాడు. నటులు సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.
