కుడివైపు గుండె ..అరుదైన వ్యాధి కాన్సెప్ట్‌తో ‘చిరంజీవి’

కుడివైపు గుండె ..అరుదైన వ్యాధి కాన్సెప్ట్‌తో ‘చిరంజీవి’

కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా శుభ సాయి వెంకట్ దర్శకత్వంలో  దీప్తి నడిమింటి నిర్మించిన చిత్రం ‘చిరంజీవి’. ఈనెల 28న సినిమా విడుదల  కానుంది.  తాజాగా స్నీక్ పీక్‌‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో  చిరంజీవి అనే యువకుడు డెక్స్ట్రోకార్డియా (కుడివైపు గుండె ఉండే అరుదైన పరిస్థితి)తో బాధపడుతుంటాడు. అతన్ని ప్రాణంగా ప్రేమిస్తుంది హీరోయిన్.

ఈ జంట సన్నిహితంగా ఉన్న సమయంలో కుడివైపు గుండె కొట్టుకునే చిరంజీవికి సాధారణంగా అందరిలాగే ఎడమవైపుకి గుండె లయను గమనించి ఆశ్చర్యపోతుంది హీరోయిన్. ఈ ట్విస్ట్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. చివరలో గ్రే షేడ్‌‌లో హీరోను చూపించారు.  ఈ చిత్రంలో  ఈశ్వరి రావు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్  భరత్,  వైవా రాఘవ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.  శేఖర్ చంద్ర సంగీతం అందించాడు.