ఇంజినీరింగ్‌ను మధ్యలో వదిలి సినీ రంగంలోకి వచ్చిన ఆదిత్య దేవులపల్లి, చాయ్ షాట్స్‌లో క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా చేరి ‘దందా’ వెబ్ సిరీస్‌తో దర్శకుడిగా పరిచయమయ్యాడు. దొర సాయి తేజ, అక్షర నల్ల, నితిన్ ప్రసన్న కీలక పాత్రలు పోషించారు. ఛాయ్ షాట్స్ ఓటీటీలో 29 చిన్న ఎపిసోడ్స్‌గా గంట నిడివితో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సందర్భంగా దర్శకుడు ఆదిత్య దేవులపల్లి మాట్లాడుతూ ‘సినిమాల కంటే ఇలాంటి మైక్రో డ్రామాలు తీయడమే కష్టం. ప్రతి సెకన్ ప్రేక్షకుడిని హుక్ చేసేలా ఉండాలి. 80 శాతం మంది సినిమా డైరెక్టర్లు కూడా మైక్రో డ్రామా చేస్తే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఈ సిరీస్‌కు ఇప్పటివరకు ఒక్క నెగెటివ్ రివ్యూ కూడా రాలేదు. ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు అందడం చాలా సంతోషంగా ఉంది. దొరసాయి తేజ అద్భుతంగా నటించారు. ఆయన టాలీవుడ్‌లో పెద్ద స్టార్ అవుతారని నమ్ముతున్నా. ఈ సిరీస్‌తో ట్రెండ్ క్రియేట్ చేశాం. ప్రస్తుతం 50 ఏళ్ల నేరస్థుడి నేపథ్యంలో ఓ కొత్త కథను సిద్ధం చేస్తున్నా’ అని చెప్పాడు.
