సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్‌లో ఉదయ్ చౌహాన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘పళ్లబురుసు’. ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి జంటగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సమర్పణలో ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణాని నిర్మిస్తున్నారు. ఇటీవల ‘కొత్త సోకు’ అనే పాటతో ఆకట్టుకున్న మేకర్స్.. మంగళవారం ‘ఇచ్చి పడేద్దాం’ అనే మరో పాటను విడుదల చేశారు.
పెళ్లి వేడుక నేపథ్యంలో సాగే ఈ పాటను పవన్ సీహెచ్ కంపోజ్ చేయగా మనీషా ఈరబత్తిని, నితేష్ అహేర్ ఎనర్జిటిక్‌గా పాడారు. ‘‘దావత్ అయినా, బారాత్ అయినా, గల్లాట అయినా, గమ్మత్తు అయినా ఇచ్చి ఇచ్చి ఇచ్చి ఇచ్చిపడేద్దాం..” అంటూ సురేష్ గంగుల రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి. ఆగస్టు 14న సినిమా విడుదల కానుంది.
