
చదువుకునే రోజుల్లో డబ్బు విలువ తెలుసుకున్నాడు. ఆర్థిక స్వేచ్ఛ లేకండా ఏదీ సాధించలేమని అర్థమైంది. అందుకే డబ్బే లక్ష్యంగా పనిచేశాడు. పదిహేడేండ్ల వయసులోనే నెట్‌వర్క్ మార్కెటింగ్ మొదలుపెట్టాడు. ఒక పెద్ద టీమ్‌ని ఏర్పాటుచేసుకున్నాడు. 21 ఏండ్లు వచ్చేసరికి కోటీశ్వరుడు అయ్యాడు పుష్కర్ రాజ్ ఠాకూర్. ఆ తర్వాత మోటివేషనల్ స్పీకర్, బిజినెస్ కోచ్, యూట్యూబర్, రిలేషన్షిప్ అడ్వైజర్‌గా ఎదిగాడు. ఇప్పుడు యూట్యూబ్ ద్వారా స్టాక్ మార్కెట్ పాఠాలు చెప్తూనే ఏంజెల్ ఇన్వెస్టర్‌గా మారాడు.
పుష్కర్ రాజ్ ఠాకూర్ 1995 జనవరి 1న ఢిల్లీలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. చిన్న వయసులోనే సక్సెస్ సాధించి మిలియనీర్ అయ్యాడు. అతనికి చిన్నప్పుడు చదువంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. కానీ.. పర్సనాలిటీ డెవలప్మెంట్, లీడర్ షిప్ మీద బాగా ఆసక్తి ఉండేది. అందుకే 9వ తరగతిలో ఉన్నప్పుడే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులో చేరాడు. ఆ టైంలో సరిగ్గా చదవడం లేదని స్కూల్ టీచర్ బాగా తిట్టడంతో కష్టపడి చదివాడు. టీచర్ భయంతోనే 10వ తరగతి పాసయ్యాడు. మోటివేషనల్ స్పీకర్‌గా రాణించాలనే ఉద్దేశంతో 12వ తరగతి తర్వాత సైకాలజీ కోర్సు చేశాడు.
అయితే.. చదువులో రాణించకపోయినా కమ్యూనికేషన్, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ నేర్చుకున్నాడు. దాంతో అతని ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. అప్పుడే ఒక నెట్‌వర్క్ మార్కెటింగ్ సెమినార్ విన్నాడు. అది అతనిలో ఎంతో స్ఫూర్తిని నింపింది. దాంతో 17 సంవత్సరాల వయసులోనే నెట్‌వర్క్ మార్కెటింగ్ మొదలుపెట్టడంతోపాటు కమ్యూనికేషన్, పర్సనల్ డెవలప్మెంట్కు సంబంధించి ఒక ట్రైనింగ్ సెంటర్‌ని స్థాపించాడు. అదే అతని సక్సెస్ జర్నీకి మొదటి మెట్టుగా నిలిచింది. దాని ద్వారా ఠాకూర్ లక్షలాది మందికి వాళ్ల కలలను సాకారం చేసుకోవడానికి కావాల్సిన మరోధైర్యాన్ని ఇచ్చాడు.
గో సెల్ఫ్‌మేడ్
గో సెల్ఫ్‌మేడ్ పేరుతో ఠాకూర్ చాలా వీడియోలు చేశాడు. దాన్ని ఒక మిషన్లా ముందుకు తీసుకెళ్తున్నాడు. తన ఫాలోవర్స్‌ని సొంత వ్యాపార ప్రయాణం మొదలుపెట్టేలా ప్రోత్సహించడం, అందుకు కావాల్సిన స్కిల్స్‌ని నేర్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాడు. ‘‘యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా సొంత వ్యాపారాలు మొదలుపెట్టడమే భారత ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఏకైక మార్గం. ఆర్థిక స్వేచ్ఛ దొరికినప్పుడే ఒక వ్యక్తి సక్సెస్ అయినట్టు” అంటాడు ఠాకూర్.
యూట్యూబ్‌లో పాఠాలు
ఠాకూర్ 2011 డిసెంబర్ 23న ‘పుష్కర్ రాజ్‌కుమార్ స్టాక్‌మార్కెట్ ఎడ్యుకేటర్’ పేరుతో యూట్యూబ్ చానెల్ పెట్టాడు. కానీ.. కొన్నేళ్ల పాటు పెద్దగా వీడియోలు చేయలేదు. 2018 నుంచి రెగ్యులర్‌గా వీడియోలు అప్లోడ్ చేస్తున్నాడు. ప్రస్తుతం చానెల్‌ని 13.9 మిలియన్ల మంది సబ్‌స్క్రయిబ్ చేసుకున్నారు. దీంతోపాటే మరో ఏడు చానెళ్లను నడుపుతున్నాడు. వాటిలో కూడా రెగ్యులర్‌గా కంటెంట్ అప్లోడ్ చేస్తున్నాడు. యూట్యూబ్‌తోపాటు ఎండార్స్‌మెంట్స్, స్టాక్‌మార్కెట్, ఇతర వ్యాపారాల ద్వారా ప్రతి నెలా లక్షల్లో సంపాదిస్తున్నాడు. అతని ఆస్తుల విలువ సుమారు రూ. 24 కోట్లు ఉంటుందని అంచనా.
21 ఏండ్లలోనే కోటీశ్వరుడు
ఠాకూర్‌కు నెట్‌వర్క్ మార్కెటింగ్ చేసిన కొత్తలో అనుకున్నంతగా లాభాలు రాలేదు. ఆ తర్వాత దాని గురించి బాగా నేర్చుకుని నెమ్మదిగా ఎదిగాడు. ప్రతి నెలా లక్షల్లో సంపాదించాడు. అతనికి 21 ఏండ్లు వచ్చేసరికి ఎవరి సాయం లేకుండానే కోటీశ్వరుడిగా మారాడు. ఇండియాలోని టాప్ నెట్‌వర్క్ మార్కెట్ డీలర్ల లిస్ట్‌లో చేరాడు. కానీ.. 24 ఏండ్ల వయసులోనే నెట్‌వర్క్ మార్కెటింగ్ నుండి రిటైర్ అయ్యాడు. అందులో తాను నేర్చుకున్న విషయాలు, అనుభవాలతో “బ్యాంగ్ ఆన్ ఇన్ నెట్‌వర్క్ మార్కెటింగ్” పేరుతో పుస్తకం కూడా రాశాడు.
యూట్యూబ్‌లోకి
ఠాకూర్ పెట్టిన ట్రైనింగ్ సెంటర్ కొన్నాళ్లకు మరిన్ని బ్రాంచ్‌లుగా విస్తరించింది. ఆఫ్‌లైన్ మోడ్‌లో ఎంతోమందికి ట్రైనింగ్ ఇచ్చాడు. అందుకోసం ప్రత్యేకంగా కొంతమంది ఎక్స్‌పర్ట్స్‌ని కూడా నియమించుకున్నాడు. ఆ తర్వాత ఠాకూర్ దృష్టి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల మీద పడింది. ముఖ్యంగా యూట్యూబ్ ద్వారా చాలా ఎక్కువమందికి రీచ్ కావొచ్చనే ఆలోచన వచ్చింది. అందుకే ఏడేళ్ల క్రితం యూట్యూబ్‌లో కంటెంట్ చేయడం మొదలుపెట్టాడు.
ఆ తర్వాత ట్రైనింగ్ అండ్ కన్సల్టెన్సీ సంస్థ ‘పీఆర్టీ గ్లోబల్ సొల్యూషన్స్’ను ప్రారంభించాడు. ‘‘చదువుతో పాటు ప్రతి ఒక్కరికీ ఆర్థిక నైపుణ్యం’’ ఉండాలి అంటాడు ఠాకూర్. అందుకే తన కన్సల్టెన్సీ సంస్థ ద్వారా స్టాక్‌మార్కెట్ పాఠాలు చెప్తున్నాడు. ‘కోర్సెడ్స్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో మరో కంపెనీ పెట్టాడు. ఇది ఒక ఈ లెర్నింగ్ ఫ్లాట్‌ఫాం. ఇందులో రకరకాల కోర్స్‌లు అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా పెద్ద పెద్ద కంపెనీలకు కూడా సర్వీస్‌లు అందిస్తున్నాడు.
స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్
ఠాకూర్ ఇన్ఫ్లుయెన్సర్గానే కాకుండా స్టాక్ మార్కెట్ ట్రైనర్‌గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఏంజెల్ ఇన్వెస్టర్‌గా మారాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా లాభాలు సాధించాడు. అంతేకాకుండా బ్రాండ్ స్పాన్సర్‌షిప్‌లు కూడా చేస్తున్నాడు. ఆయన యూట్యూబ్‌లో ఎక్కువగా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, వ్యక్తిత్వ వికాసం, బిజినెస్ గ్రోత్‌పైనే వీడియోలు చేస్తున్నాడు. ఠాకూర్ స్పీచ్‌లు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ఉంటాయి.
►ALSO READ | బెంగాల్ టైగర్ అశుతోష్ ముఖర్జీ.. విద్యార్థి జాతికి నిజమైన స్నేహితుడు
ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ప్రోత్సహిస్తాయి. అతను రెండుసార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సాధించాడు. 2022లో “అతిపెద్ద సోషల్ మీడియా మార్కెటింగ్ లెసన్”, 2023లో “అతిపెద్ద ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్ లెసన్” చెప్పి రికార్డ్స్ క్రియేట్ చేశాడు.
స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్
ఠాకూర్ ఇన్ఫ్లుయెన్సర్గానే కాకుండా స్టాక్ మార్కెట్ ట్రైనర్‌గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఏంజెల్ ఇన్వెస్టర్‌గా మారాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా లాభాలు సాధించాడు. అంతేకాకుండా బ్రాండ్ స్పాన్సర్‌షిప్‌లు కూడా చేస్తున్నాడు. ఆయన యూట్యూబ్‌లో ఎక్కువగా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, వ్యక్తిత్వ వికాసం, బిజినెస్ గ్రోత్‌పైనే వీడియోలు చేస్తున్నాడు. ఠాకూర్ స్పీచ్‌లు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ఉంటాయి.
ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ప్రోత్సహిస్తాయి. అతను రెండుసార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సాధించాడు. 2022లో “అతిపెద్ద సోషల్ మీడియా మార్కెటింగ్ లెసన్”, 2023లో “అతిపెద్ద ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్ లెసన్” చెప్పి రికార్డ్స్ క్రియేట్ చేశాడు.