నేడే ధామి ప్రమాణ స్వీకారం.. ప్రత్యేక పూజలు

నేడే ధామి ప్రమాణ స్వీకారం.. ప్రత్యేక పూజలు

డెహ్రాడూన్ లోని తప్కేశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రత్యేక పూజలు చేశారు. ఇశాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆయన ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రమాణస్వీకారానికి ముందు ఆయన ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు తమకు పూర్తిగా మెజారిటీ ఇచ్చారని అన్నారు పుష్కర్ సింగ్ ధామి.. రెండో సారి తమ సర్కార్ కొలువుదీరనుందన్నారాయన.

మరోవైపు ఇవాళ సీఎంగా ధామి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండోసారి ఉత్తరాఖండ్ సీఎంగా ధామి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ధామి ఓటమి బీజేపీ అధిష్టానం మాత్రం ఆయనకే సీఎం పగ్గాలు ఇచ్చేందుకు మొగ్గు చూపింది. దీంతో సీఎం రేసులో చాలామంది ఉన్నప్పటికీ... ధామికి ముఖ్యమంత్రి పీఠం దక్కింది.