9 ఏండ్లు పట్టించుకోని మోదీ.. ఇప్పుడు ప్రేమను ఒలకబోస్తున్నరు ; పుష్ప లీల

9 ఏండ్లు పట్టించుకోని మోదీ.. ఇప్పుడు ప్రేమను ఒలకబోస్తున్నరు ; పుష్ప లీల

హైదరాబాద్​, వెలుగు: మాదిగలను 9 ఏండ్ల పాటు పట్టించుకోని ప్రధాని నరేంద్ర మోదీ.. ఇప్పుడు ప్రేమను ఒలకబోస్తున్నరని మాజీ మంత్రి, పీసీసీ ఉపాధ్యక్షురాలు పుష్పలీల విమర్శించారు. పరేడ్ గ్రౌండ్ సభలో మోదీ ప్రసంగం స్టంట్​లాగా ఉందన్నారు.  నటించడంలో మోదీ, కేసీఆర్​ఇద్దరూ ఇద్దరేనన్నారు. సోమవారం ఆమె గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. మంద కృష్ణ మాదిగ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 

మాదిగ సమాజం ఆయన వ్యాఖ్యలను చూసి షాక్​ అవుతున్నదని తెలిపారు. విశ్వరూప సభ తనకు బ్లాక్​ డే లాగా అనిపించిందని చెప్పారు. తన జాతిని మోదీ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. దళితుల పక్షాన ఉన్న పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్​కు మాత్రమే దళితులకు ఓటు అడిగే అర్హత ఉందని వెల్లడించారు. కవితను వదిలిపెట్టి సోనియా గాంధీపై ఈడీ కేసులు పెడుతున్నదని, దాన్ని బట్టే బీజేపీ, బీఆర్​ఎస్​ దోస్తీ ఏంటనేది అర్థమవుతున్నదని విమర్శించారు. 

ALSO READ : హోటల్‌‌ వర్కర్​పై గ్యాంగ్ రేప్