
ఇంతవరకు గ్లామర్ రోల్స్‌తో ఇంప్రెస్ చేసిన రష్మిక మందాన్న.. ఈసారి డీగ్లామర్‌గానూ కనిపించి మెప్పిస్తానంటోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తీస్తున్న ‘పుష్ప’లో శ్రీవల్లి అనే విలేజ్ గాళ్‌గా తను కనిపించబోతోంది. ఇందులో ఆమెకి ఓ సోలో సాంగ్ కూడా ఉంది. రీసెంట్గా రష్మిక లుక్‌ని రిలీజ్ చేసిన టీమ్.. ఆమెపై తీసిన పాటని దసరా సందర్భంగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే బన్నీపై తీసిన ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్ సెన్సేషనల్ హిట్టయ్యింది. మరి శ్రీవల్లి సాంగ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే!