Constitution Day: వికసిత్ భారత్ సాకారం కోసం పనిచేయండి.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ బహిరంగ లేఖ

Constitution Day: వికసిత్ భారత్ సాకారం కోసం పనిచేయండి.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ బహిరంగ లేఖ

భారత రాజ్యాంగ దినోత్సవం  సందర్భంగా  ప్రధాని మోదీ  దేశ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. 2047 నాటి వికసిత్ భారత్ లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని కోరారు. ఓటు హక్కు ద్వారానే  ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని  అన్నారు.  ఈ సందర్బంగా రాజ్యాంగ నిర్మాతలకు నివాళులు అర్పించారు మోదీ.  వారి దార్శనికత ,దూరదృష్టి వికసిత్ భారత్‌ను నిర్మించాలనే మా ప్రయత్నంలో మాకు ప్రేరణగా ఉన్నాయన్నారు. 

రాజ్యాంగం గొప్పతనం,  ప్రాధమిక విధుల ప్రాముఖ్యత, మొదటి సారి ఓటరు కావడం వంటి అంశాలను హైలైట్ చేసిన మోదీ..18 నిండి మొదటి సారి ఓటర్లు అయిన వారిని గౌరవించడం ద్వారా స్కూళ్లు, కాలేజీలు రాజ్యాంగా దినోత్సవాన్ని జరుపుకోవాలని సూచించారు.

మన రాజ్యాంగం భారతీయులగౌరవం, సమానత్వం ,స్వేచ్ఛకు అత్యంత ప్రాముఖ్యతనిస్తుంది. ఇది మనకు హక్కులను కల్పిస్తూనే, పౌరులుగా మన విధులను కూడా గుర్తు చేస్తుంది..వీటిని మనం ఎల్లప్పుడూ నెరవేర్చడానికి ప్రయత్నించాలి. ఈ విధులు బలమైన ప్రజాస్వామ్యానికి పునాది అని మోడీ X లో ప్రత్యేక పోస్ట్‌లో తెలిపారు. 

రాజ్యాంగ నిర్మాతలకు కూడా ఆయన నివాళులు అర్పించారు. "వారి దార్శనికత మరియు దూరదృష్టి విక్షిత్ భారత్‌ను నిర్మించాలనే మా ప్రయత్నంలో మమ్మల్ని ప్రేరేపిస్తూనే ఉన్నాయి" అని ఆయన అన్నారు.