మార్చి 24 జాతీయ సంతాప దినం: పుతిన్

మార్చి 24 జాతీయ సంతాప దినం: పుతిన్

రష్యాలోని మాస్కో నగరంలో సిటీ హాల్ లో ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడిపై రష్యా అద్యక్షుడు వ్లామిదిర్ పుతిన్ స్పందించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 143 మంది చనిపోయారు. ఇంకా వందమందికి పైగా గాయాలపాలైయ్యారు. ఈనేపథ్యంలో రేపు (మార్చి 24)న జాతీయ సంతాప దినంగా ప్రకటించాడు. మాస్కో సమీపంలోని క్రోకస్ సిటీ హాల్‌లో జరిగిన దాడిని అనాగరిక ఉగ్రవాద చర్యగా పేర్కొన్నారు. 

కాల్పులు జరిగిప 11 మంది దుండగులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ చర్యకు పాల్పడిన నేరస్థులు ఉక్రెయిన్ వైపు వెళ్లారని, ఉక్రెయిన్ ఈ దాడి వెనుక ఉందని పుతిన్ ఆరోపించారు. అయితే ఉక్రెయిన్ మాత్రం ఆ దాడితో తనకు ఏ సంబంధం లేదని ఖండిస్తోంది. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి పుతిన్ వ్యాఖ్యలపై స్పందించారు.  అయితే  క్రోకస్ సిటీ హాల్ లో జరిగిన కాల్పుల్లో ఉక్రెయిన్  ప్రమేయం లేదని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి వాదించారు.