గ్రీన్ లాండ్ సంగతి మాకు అక్కర్లేదు..అమెరికా, డెన్మార్క్ చూసుకుంటయ్: పుతిన్

గ్రీన్ లాండ్ సంగతి మాకు అక్కర్లేదు..అమెరికా, డెన్మార్క్ చూసుకుంటయ్: పుతిన్

మాస్కో: గ్రీన్ లాండ్ వ్యవహారంతో తమకు సంబంధం లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ప్రస్తుతం ఆ దేశం విషయంలో ఏం జరుగుతుందో మాకు అనవసరమని పేర్కొన్నారు. 

సమస్యను అమెరికా, డెన్మార్క్​ కలిసి పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. గురువారం ఆయన మాస్కోలో జాతీయ భద్రతా మండలి సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. 

గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అమెరికా కొనుగోలు చేయాలనుకుంటే  తమకు అభ్యంతరం లేదని.. అది ఆ రెండు దేశాల వ్యవహారమని పుతిన్ అన్నారు. అమెరికా, డెన్మార్క్  గొడవపై తమకు ఎలాంటి ఆందోళన లేదన్నారు.