క్షీణించిన పుతిన్ ఆరోగ్యం.. తలనొప్పి, మాటలో తడబాటు

క్షీణించిన పుతిన్ ఆరోగ్యం.. తలనొప్పి, మాటలో తడబాటు

మాస్కో: రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం క్షీణించిందని ఓ రిపోర్టు తెలిపింది. ఆయన తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారని, అంతేకాకుండా ఆయన కంటిచూపు మందగించిందని, మాటలో తడబాటు ఉందని ఆ రిపోర్టు పేర్కొంది. రష్యా–ఉక్రెయిన్  యుద్ధం ఆరంభమైనప్పటి నుంచి పుతిన్  ఆరోగ్యం హాట్  టాపిక్ గా మారింది. ఆయన హెల్త్  దిగజారిందని గత కొద్ది రోజులపాటు వదంతులు కూడా వినిపించాయి. 

ఈ టైమ్ లో పుతిన్  ఆరోగ్యం క్షీణించిందని జనరల్ ఎస్ వీఆర్ టెలిగ్రాం చానెల్ (పుతిన్ హెల్త్ కండిషన్ గురించి తెలియజేసే సంస్థ) తాజాగా ఓ రిపోర్టు విడుదల చేసింది. ‘‘పుతిన్ కుడి మోచేయి, కుడి కాలులో కొద్దిగా చలనం లేదు. అర్జెంట్ గా ఆయనకు ట్రీట్ మెంట్ చేయాలి. ఇప్పటికే డాక్టర్ల బృందం ఫస్ట్ ఎయిడ్  చేసింది. కొద్ది రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు ఆయనకు సూచించారు. అయితే రెస్ట్ తీసుకోవడానికి పుతిన్  నిరాకరించినట్లు తెలుస్తోంది” అని జనరల్ ఎస్ వీఆర్  తన రిపోర్టులో వెల్లడించింది. పుతిన్​ ఆరోగ్యం పర్ఫెక్ట్​ గా ఉందని  రష్యన్ మంత్రి ఒకరు తెలిపారు.