
ప్రయోగ పరీక్షల్లో భాగంగా ముక్కుద్వారా వేసే కరోనా వ్యాక్సిన్ 'స్ఫుత్నిక్ వీ'ని తీసుకున్నట్లు తెలిపారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఈ టీకా వేసుకున్న తర్వాత తనకు ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని చెప్పారు. ఈ నాసికా టీకా ప్రయోగ పరీక్షల (క్లినికల్ ట్రయల్స్)కు సంబంధించి 500 మంది వాలంటీర్లకు వేసేందుకు గాను గత నెలలో రష్యా వైద్య, ఆరోగ్య శాఖ అనుమతించింది. అయితే ఆ ప్రక్రియ ప్రారంభమైన విషయంపై మాత్రం స్పష్టత లేదు. గతంలో రష్యా స్వదేశీ టీకా 'స్ఫుత్నిక్ వీ'ని కూడా పుతిన్ తీసుకున్నారు. అలాగే తాను స్ఫుత్నిక్ లైట్ బూస్టర్ డోసు కూడా వేసుకున్నట్లు గత ఆదివారం తెలిపారు పుతిన్.