యూరప్‌‌‌‌లోని పుతిన్ ఆస్తులు జప్తు

యూరప్‌‌‌‌లోని పుతిన్ ఆస్తులు జప్తు

బ్రస్సెల్స్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, విదేశాంగ మంత్రి సర్గీయ్ లవ్‌‌‌‌రోవ్‌‌‌‌లకు యూరప్‌‌‌‌లో ఉన్న ఆస్తులను జప్తు చేసేందుకు యూరోపియన్ యూనియన్ అంగీకారం తెలిపింది. ఉక్రెయిన్‌‌‌‌పై రష్యా దాడి నేపథ్యంలో విధిస్తున్న ఆంక్షల్లో భాగంగా శుక్రవారం ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘మేం పుతిన్ వ్యవస్థను దెబ్బతీస్తున్నం. ఆర్థికంగా మాత్రమే కాదు.. ముఖ్యమైన పవర్‌‌‌‌‌‌‌‌పై వేటువేస్తున్నం. అందుకే పుతిన్, లవ్‌‌‌‌రోవ్ లిస్టులు తీస్తున్నం” అని జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్‌‌‌‌బాక్ చెప్పారు. బ్రస్సెల్స్‌‌‌‌లో జరిగిన ఈయూ మీటింగ్​లో ఆమె మాట్లాడారు. ర‌‌‌‌ష్యా ఎయిర్‌‌‌‌లైన్స్‌‌‌‌పై ఈయూ నిషేధం విధించింది. హైటెక్ రిఫైన‌‌‌‌రీ ఉత్పత్తుల స‌‌‌‌ర‌‌‌‌ఫ‌‌‌‌రాను నిలిపివేసింది. అమెరికా కూడా నాలుగు పెద్ద బ్యాంకుల లావాదేవీలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. కోట్ల డాలర్ల విలువైన రష్యా ఆస్తులను జప్తు చేస్తామని అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశారు.