లారీ కింద ప్రత్యేక అరలు​పెట్టి.. గంజాయి స్మగ్లింగ్

లారీ కింద ప్రత్యేక అరలు​పెట్టి.. గంజాయి స్మగ్లింగ్
  • లారీ కింద ప్రత్యేక అరలు​పెట్టి తరలింపు
  • రాయపర్తిలో 500 కిలోల మాల్​పట్టివేత
  • ఇద్దరు అరెస్ట్...పరారీలో మరో ఇద్దరు

రాయపర్తి, వెలుగు: వరంగల్​జిల్లా రాయపర్తిలో సోమవారం పుష్ప సినిమా తరహాలో లారీల కింద ప్రత్యేక అరలు ఏర్పాటు చేసి గంజాయి తరలిస్తూ దొరికిపోయారు. వెస్ట్​ జోన్​డీసీపీ సీతారాం కథనం ప్రకారం..రాయపర్తి పోలీస్​ స్టేషన్​ వద్ద సోమవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ కారులో 20 కిలోల ఎండు గంజాయి ప్యాకెట్లు దొరికాయి. విశాఖపట్నం–నర్సీపట్నంకు చెందిన పోలిరెడ్డి గంగరాజు, తురాల నానాజీలను విచారించగా తమ వెనకాలే ట్రాలీ లారీ ఉందని అందులో గంజాయి ఉందని చెప్పారు. దీంతో ఆ లారీని ఆపగా డ్రైవర్, క్లీనర్లు అప్పికొండ శివ, అడప కిశోర్​ కిందికి దూకి పారిపోయారు.

అయితే లారీలో చెక్​ చేస్తే ఏమీ కనిపించలేదు. అనుమానం వచ్చి క్షుణ్ణంగా పరిశీలించగా, మధ్య భాగంలో ఏదో ఆల్ట్రేషన్​చేసినట్టు అనిపించింది.  లారీ వెనక భాగంలోని ఎలక్ట్రానిక్​ షాకాబ్జర్స్​ను పైకి లేపగా మధ్యలో 480 కిలోల ఎండు గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. లారీ బాడీకి , కింది భాగంలో ఉన్న  ప్లేస్​లో ఐరన్​తో అరలు చేయించి గంజాయిని పెట్టి స్మగ్లింగ్​ చేస్తున్నారు. తహసీల్దార్​ కుసుమ సత్యనారాయణ సమక్షంలో పంచనామ నిర్వహించి నిందితులను అరెస్ట్​ చేసినట్లు డీసీపీ తెలిపారు. వర్ధన్నపేట ఏసీపీ గొళ్ల రమేశ్​, సీఐ సదన్​ కుమార్​, ఎస్సై బండారి రాజు పాల్గొన్నారు.

 

ఇవి కూడా చదవండి

ఎగ్జామ్స్‌‌ ముందు ఇట్ల తినాలె

జీతాలు రాక ప్రభుత్వ టీచర్ల అవస్థలు

పర్సనాలిటీ డిజార్డర్​తో పరేషాన్​

అప్పుల మీద అప్పులు .. జీతాలు, పింఛన్లు, ఖర్చులకు కటకట