భారత రత్న పీవీ : నవోదయ స్కూల్స్, కేంద్రీయ విద్యాలయాల సృష్టి కర్త

భారత రత్న పీవీ : నవోదయ స్కూల్స్, కేంద్రీయ విద్యాలయాల సృష్టి కర్త

 1972 నుంచి పీవీ నరసింహారావు నేషనల్ పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యారు.  కేంద్రమంత్రిగా అనేక శాఖలు చూశారు. ఇందిరా గాంధీ కేబినెట్ లో  విదేశాంగ మంత్రి గా పనిచేశారు.1985లో రాజీవ్ కేబినెట్ లో మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి గా బాధ్యతలు చేపట్టారు. ‘ఆపరేషన్ బ్లాక్ బోర్డు ’ పథకం పీవీ ఆలోచనల్లోంచి పుట్టిందే. దేశవ్యాప్తంగా అనేక సింగిల్ టీచర్ స్కూల్స్ ను డబుల్ టీచర్ స్కూల్స్ గా ఆయన మార్చారు. ప్రతి జిల్లాకు ఒక నవోదయ విద్యాలయం అప్పుడు వచ్చిందే. కేంద్రీయ విద్యాలయాలు కూడా ఆయన ఆలోచనల్లోంచి పుట్టినవే. 1988లో రెండోసారి ఆయన విదేశాంగ మంత్రి అయ్యారు. ఇరుగుపొరుగు దేశాలతో మంచి సంబంధాల కోసం ప్రయత్నించారు.

ప్రధానిగా అన్నీ సొంత నిర్ణయాలే

పీవీ నరసింహారావు ప్రధానిగా పాలనపై తన మార్క్ వేశారు.  ప్రధానిగా ఆయన తీసుకున్న అన్ని కీలక నిర్ణయాలు ఆయన ఆలోచనల్లోంచి వచ్చినవే. సోనియా గాంధీ సలహాలు, సూచనలు ఏమాత్రం లేవంటారు. దేశానికి ఏది మంచిదో అదే విధానంగా పీవీ ముందుకెళ్లారు. ప్రపంచదేశాల్లో ఇండియాకు ఒక గుర్తింపు తీసుకువచ్చారు. జీవితాంతం కాంగ్రెస్ కు ఒక సైనికుడిలా పనిచేసిన పీవీ నరసింహారావు పట్ల ఆ పార్టీ లీడర్లు సరిగా ప్రవర్తించలేదంటారు రాజకీయ పండితులు. 2004 లో ఆయన చనిపోయినప్పుడు ఒక మాజీ ప్రధాని హోదాలో ఢిల్లీలో ఆయన సమాధికి కాస్తంత స్థలం కూడా కేటాయించని విషయాన్ని  పొలిటికల్ ఎనలిస్టులు గుర్తు చేస్తుంటారు. దీని వెనుక సోనియా గాంధీ ఉన్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. తన మాట విననందుకు పీవీపై  సోనియా కక్ష తీర్చుకున్నారన్నది  రాజకీయవర్గాల్లో వినిపించే విమర్శ.

ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే

ప్రధాని అయిన తర్వాత ఓసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ‘ ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే ’ నంటూ పీవీ చేసిన కామెంట్స్ పాపులర్ అయ్యాయి. దేశానికి ప్రధాని అయినా తెలుగు నేల తన తల్లిలాంటిదని ఆయన చెప్పారు. అప్పటి హైదరాబాద్ సంస్థానంలో తాను పుట్టి పెరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తెలుగువాడిగా పుట్టినందుకు గర్విస్తున్నట్లు చెప్పారు.

తొలి సౌత్ ప్రధాని

పీవీ నరసింహారావు ప్రధాని కావడంలో చాలా ప్రత్యేకతలున్నాయి. సౌతిండియా నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తిగా పీవీ చరిత్ర సృష్టించారు. తెలుగువాడు ప్రధాని కావడం అందరికీ గర్వకారణమైంది.  అప్పటివరకు కాంగ్రెస్ ప్రధానులంతా నెహ్రూ కుటుంబం నుంచి వచ్చిన వారే. అయితే పీవీ టోటల్ గా డిఫరెంట్. నాన్ నెహ్రూ కుటుంబం నుంచి ప్రధాని పగ్గాలు చేపట్టిన తొలి నాయకుడు పీవీనే.

మెజారిటీ లేకుండా ఐదేళ్లు ….

లోక్‌సభలో మైనారిటీలో ఉన్నప్పటికీ పూర్తిగా ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని నడిపిన మొదటి ప్రధాని పీవీ నరసింహారావు. పీవీ ప్రభుత్వం అవిశ్వాస పరీక్షను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఎంపీలకు ఆయన లంచం ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు  కేసు కొట్టివేసింది.