భారత రత్న పీవీ : మన్మోహన్​ను తీసుకు వచ్చింది మన పీవీనే

భారత రత్న పీవీ : మన్మోహన్​ను తీసుకు వచ్చింది మన పీవీనే

ఎకానమిస్టుగా ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ ను రాజకీయాల్లోకి తీసుకువచ్చింది పీవీ నరసింహారావే. మన్మోహన్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యం ఒకసారి చూద్దాం.  1985 నాటికి దేశ ఆర్థిక రంగం దెబ్బతినడం మొదలైంది. 1991 నాటికి పరిస్థితి మరీ భయంకరంగా మారింది. ఒక దశలో దిగుమతులు చేసుకున్న వస్తువులకు కూడా చెల్లించడానికి సైతం డబ్బులు ఉండేవి కావు. దీంతో ప్రపంచదేశాల్లో ఇండియా ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం నెలకొంది.

దేశాన్ని ఇలా ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టిన ఈ పరిస్థితుల్లో  పీవీ ప్రధాని అయ్యారు. ప్రధాని కుర్చీలో కూర్చున్నారో, లేదో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి మంత్రాంగం మొదలెట్టారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా ఉన్న  డాక్టర్ మన్మోహన్ సింగ్ కు ఫైనాన్స్ మినిస్ట్రీ అప్పగించారు. అంతేకాదు మన్మోహన్ కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఉద్యోగాలే చేసుకునే  వ్యక్తి ఆర్థిక మంత్రిగా పనిచేయగలడా ? అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు.

అయితే మన్మోహన్ తో తనకు కావలసిన విధంగా పనిచేయించుకోవడంలో పీవీ సక్సెస్ అయ్యారు. ఆర్థిక రంగంలో లిబరలైజేషన్ పాలసీకి ద్వారాలు తెరిచారు. దేశాన్ని  దివాళా స్థితి నుంచి  గట్టెక్కించడానికి ధైర్యంగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థిక లోటును తగ్గించగలిగారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు అప్పగించడానికి వీలుగా చర్యలు తీసుకున్నారు. పీవీ సర్కార్ అమలు చేసిన  ఈ పాలసీల  ఫలితంగా దేశం ఫైనాన్షియల్ గా గట్టెక్కగలిగింది.