మలేసియా ఓపెన్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో పీవీ సింధు

మలేసియా ఓపెన్‌‌‌‌‌‌‌‌  క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో పీవీ సింధు

కౌలాలంపూర్‌‌‌‌‌‌‌‌: ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌ షట్లర్‌‌‌‌‌‌‌‌ పీవీ సింధు.. మలేసియా ఓపెన్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌–1000 టోర్నీలో క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో సింధు 21–8, 21–13తో ఎనిమిదోసీడ్‌‌‌‌‌‌‌‌ టోమోకా మియాజాకి (జపాన్‌‌‌‌‌‌‌‌)పై గెలిచింది. దాంతో జపాన్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌తో ముఖాముఖి రికార్డును 2–1కి పెంచుకుంది. 33 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో సింధు తన ట్రేడ్‌‌‌‌‌‌‌‌ మార్క్‌‌‌‌‌‌‌‌ షాట్లతో అలరించింది.

 5–1తో తొలి గేమ్‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టిన తెలుగమ్మాయి ఆ తర్వాత వరుసగా 13 పాయింట్లు సాధించి 18–4తో లీడ్‌‌‌‌‌‌‌‌లో నిలిచింది. అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకునే అవసరం రాలేదు. రెండో గేమ్‌‌‌‌‌‌‌‌ కూడా చాలావరకు ఏకపక్షంగానే సాగింది. మెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో సాత్విక్‌‌‌‌‌‌‌‌ సాయిరాజ్‌‌‌‌‌‌‌‌–చిరాగ్‌‌‌‌‌‌‌‌ షెట్టి 21–18, 21–11తో వరల్డ్‌‌‌‌‌‌‌‌ 17వ ర్యాంకర్లు జునైద్‌‌‌‌‌‌‌‌ ఆరిఫ్‌‌‌‌‌‌‌‌–రాయ్‌‌‌‌‌‌‌‌ కింగ్‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌ (మలేసియా)పై నెగ్గి క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించారు. మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో ఆయుష్‌‌‌‌‌‌‌‌ షెట్టి 18–21, 21–18, 12–21తో షుయ్‌‌‌‌‌‌‌‌ యి కీ (చైనా) చేతిలో, లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌ 20–22, 15–21తో లీ చెయుక్ యియు (హాంకాంగ్‌‌‌‌‌‌‌‌) చేతిలో కంగుతిన్నారు.