సింధు.. టైటిల్ కొట్టేనా?

సింధు.. టైటిల్ కొట్టేనా?

సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్‌‌ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ టోర్నీలో మూడో సీడ్‌‌గా బరిలోకి దిగుతున్న సింధుకు అనుకూలమైన డ్రా లభించింది. 2024 లో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ గెలిచిన తర్వాత ఆమె ఇప్పటివరకు ఒక్క వరల్డ్ టూర్ టైటిల్ సాధించలేదు. సింధు తన తొలి మ్యాచ్‌‌లో పెరూకు చెందిన ఇనెస్ లూసియా కాస్టిల్లోతో తలపడనుంది.

అంతా సవ్యంగా సాగితే సెమీఫైనల్లో జపాన్ స్టార్ అకానె యమగూచితో తలపడే అవకాశం ఉంది. ఈ టోర్నీలో భారత మహిళల సింగిల్స్ విభాగం నుంచి తన్వి శర్మ, మాళవిక బన్సోద్, అన్మోల్ ఖర్బ్, ఆకర్షి కాశ్యప్, తన్య హేమంత్ కూడా పోటీ పడుతున్నారు. పురుషుల సింగిల్స్ విభాగానికి యువ సంచలనం, ఆరో సీడ్ ఆయుష్ శెట్టి నాయకత్వం వహించనున్నాడు. మాజీ కాంస్య పతక విజేత హెచ్ఎస్ ప్రణయ్ తొలి మ్యాచ్‌‌లో ఇండోనేషియాకు చెందిన మొహమ్మద్ జాకీ ఉబాతో, కిరణ్ జార్జ్ మలేషియాకు చెందిన జస్టిన్ హోహ్‌‌తో తలపడనున్నారు.