పేర్లు చెప్తే కాంట్రవర్సీ.. సినిమాలు నచ్చలేదు.. పీవీ సింధు ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

పేర్లు చెప్తే కాంట్రవర్సీ.. సినిమాలు నచ్చలేదు.. పీవీ సింధు ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

తెలుగు సినిమాలు, హీరోల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు(PV Sindhu). తెలుగులో తన అభిమాన నటుడు ప్రభాస్(Prabahs) అని, ఆయనంటే క్రష్ కూడా ఉందని తన మనసులోని మాటను బయట పెట్టేసారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె త్వరలో తెలుగు సినిమాలో నటించబోతున్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. తన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ విషయాల గురించి చెప్పుకొచ్చారు. కాలక్షేపానికి సినిమాలు చూస్తాను. నాకు ఇష్టమైన హీరో అంటే ప్రభాస్. ఆయన నటన అంటే నాకు చాలా ఇష్టం కానీ, ఆయన్ని డైరెక్ట్ గా కలిసే అవకాశం దక్కలేదు. ఇక రామ్ చరణ్ అంటే కూడా చాలా ఇష్టం. ఆయన్ని చాలాసార్లు కలిసాను. ఒలంపిక్ మెడల్ గెలిచిన్నప్పుడు చిరంజీవి గారు ప్రత్యేకంగా వాళ్ళ ఇంటికి ఆహ్వానించి సత్కరించారు. అది నేను ఎప్పటికి మర్చిపోలేను. ఇలా చెప్పుకుంటూ పోతే ఇష్టమైన హీరోల లిస్టు పెద్దదే. 

ఇక విజయ్ దేవరకొండ నటన అంటే కూడా నాకు చాలా ఇష్టం. కానీ, విజయ్ చేసిన కొన్ని సినిమాలు మాత్రం నాకు నచ్చలేదు. పేర్లు చెప్పలేను. నాకు నచ్చనివి కొందరికి నచ్చొచ్చు కదా. అనవసరమైన కాంట్రవర్సీ. ఇక నేను నటిగా సినీ ఎంట్రీ ఇస్తున్నాను అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఒకవేళ ఫ్యూచర్ లో నా బయోపిక్ లాంటిది చేస్తే.. నా పాత్రలో దీపికా పదుకొనె అయితే బాగా సెట్ అవుతుంది.. అంటూ చెప్పుకొచ్చారు సింధు. ప్రస్తుతం పీవీ సింధుకు సంబందించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.