Upasana Konidela: మెగా ప్రిన్సెస్ క్లింకార చెల్లెళ్లను పరిచయం చేసిన ఉపాసన

Upasana Konidela: మెగా ప్రిన్సెస్ క్లింకార చెల్లెళ్లను పరిచయం చేసిన ఉపాసన

ఉపాసన రామ్ చరణ్..మెగా కోడలుగా కుటుంబ బాధ్యతలను..అపోలో హాస్పిటల్ వ్యవహారాలను చూసుకుంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. హీరో రామ్ చరణ్ని పెళ్లాడి మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టిన ఆమె..మంచి మర్యాదలతో, హెల్త్ పరమైన టిప్స్ ఇస్తూ..సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఫాల్లోవింగ్ పెంచుకుంది. .

అసలు విషయానికి వస్తే..లేటెస్ట్గా ఉపాసన (Upasana) చేసిన ఇంస్టాగ్రామ్ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ‘క్లింకార చెల్లెళ్లను తమ ఫ్యాన్స్కు పరిచయం చేసింది. అదేంటి మెగా ప్రిన్సెస్ క్లింకార (Klin Kaara) వచ్చి కొన్ని నెలలే అయింది కదా..అంతలోనే చెల్లెల్లు ఏంటనీ ఆలోచించకండి.? వివరాల్లోకి వెళితే..ఉపాసన చెల్లెలు అన్షుపాలకు మూడేళ్ల క్రితం అర్మాన్ ఇబ్రహీంతో  పెళ్లి అవ్వగా..ఇటీవల కవలపిల్లలకు జన్మనిచ్చింది. అలా..ఉపాసన చెల్లెలి పిల్లలు క్లింకారకు చెల్లెళ్లు అవుతారు కదా..వారే వీరు.

తాజాగా వారికి నామకరణం చేసే ఫంక్షన్ లో రామ్ చరణ్ ఫ్యామిలీ సందడి చేశారు. ప్రస్తుతం వీరందరూ కలిసి ఉన్న ఫొటోస్ ఉపాసన పోస్ట్ చేస్తూ..'అద్భుతమైన, అందమైన ముగ్గురు అక్క చెల్లెళ్లని పరిచయం చేస్తున్నాం..క్లింకార తన చెల్లెళ్లు అయిన ఐరా పుష్పా ఇబ్రహీం మరియు రికా సుచరిత ఇబ్రహీంతో చేరిపోయింది' అంటూ ఉపాసన పోస్ట్ లో రాసుకొచ్చింది.

ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో చరణ్ క్లింకారను ఎత్తుకున్నాడు. మెగా ఫ్యాన్స్ క్యూట్ మూమెంట్స్..క్లింకారకు తోడు దొరికింది..ఆడుకోవడానికి అని కామెంట్స్ చేస్తున్నారు.