
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్లే తోవలో భారీ కొండచిలువ కలకలం రేపింది. ఈ రోజు పొద్దున పాపవినాశనం కు వెళ్లే మార్గం వద్ద కొవడచిలువ కనిపించింది. దీంతో భక్తులు భయపడి దూరంగా వెళ్లిపోయారు. సమాచారం టీటీడీకి అందించారు. పాములు పట్టడానికి టీటీడీ ఏర్పాటుచేసుకున్న ఉద్యోగి భాస్కర్ అక్కడికి చేరుకుని దాదాపు పది అడుగుల పొడవు ఉన్న కొండ చిలువను పట్టుకున్నారు. ఆతర్వాత ఆ పామును అడవిలో వదిలిపెడుతున్నట్లు చెప్పారు.