ప్లీజ్ చంపకండి.. నేను బ్రతికే ఉన్నా

ప్లీజ్ చంపకండి.. నేను బ్రతికే ఉన్నా

క్వాడెన్‌ బేల్స్‌ చనిపోయాడంటూ కొన్న పోస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  అయితే వైరల్ అవుతున్నా పోస్ట్ లపై బీబీసీ వాటర్ మార్క్  ఉండడంతో అందరూ నిజమే అనుకున్నారు. కానీ తాము క్వాడెన్ కు సంబంధించిన పోస్ట్ లు పబ్లిష్ చేయలేదని బీబీసీ వివరణ ఇచ్చింది.

క్వాడెన్‌ బేల్స్‌ ఎవరు..?

క్వాడెన్‌ బేల్స్‌ గుర్తున్నాడా..? గత నెలలో మరగుజ్జు రూపంతో ఉన్న తనని క్లాస్ మెట్స్  ఏడిపిస్తున్నారంటూ  ఆస్ట్రేలియాకు చెందిన 9 ఏళ్ల క్వాడెన్‌ బేల్స్‌  స్కూల్ నుంచి  ఇంటికి రాగానే  ‘అమ్మా.. నేను బతకను.. నాకు ఒక తాడు ఇవ్వు.. చచ్చిపోతా’ అంటూ రోదించాడు. కత్తి అయినా ఇవ్వు.. గుండెల్లో పొడుచుకుని చనిపోతా లేదంటే ఎవరైనా నన్ను చంపేయండి అని విలపించాడు. తన కొడుకు బాధను వీడియో తీసిన తల్లి.. స్కూల్ లో తోటి పిల్లల తీరును ప్రస్తావిస్తూ, వాళ్ల తల్లిదండ్రులు ఎలా పెంచుతున్నారో అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.

తాజాగా క్వాడెన్ చనిపోయాడంటూ వైరల్ అవుతున్న వార్తలు

తాజాగా క్వాడెన్ ఆత్మహత్య చేసుకున్నట్లు కొన్నివార్తలు నెట్టింట్లో  హాట్ టాపిగ్గా మారాయి. అందుకు కారణం క్వాడెన్ మూడు సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడంటూ బాలుడి తల్లి గతంలో మీడియాకి చెప్పింది. ఆ వార్తల్ని పలువురు  క్వాడెన్ చనిపోయాడంటూ తప్పుడు వార్తల్ని వైరల్ చేస్తున్నారు.

క్వాడెన్ చనిపోలేదు..బ్రతికే ఉన్నాడు.

క్వాడెన్ వార్తలపై ఇండియా టుడే స్పందించింది. నెట్టింట్లో క్వాడెన్ చనిపోయినట్లు చూపిస్తున్న ఫోటో నిజం కాదని తేల్చింది. ఆ ఫోటో అమెరికాకు చెందిన 9ఏళ్ల బాలుడిదని తేల్చి చెప్పింది.

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు

క్వాడెన్ మృతి పట్ల వస్తున్న వార్త లపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్వాడెన్ గురించి తప్పుడు ప్రచారం చేయోద్దని కోరుతున్నారు.  బ్రతికున్న వాళ్లను చంపే ప్రయత్నం చేయోద్దని కోరుతున్నారు

see this – పెదనాన్నను చంపి.. సెల్ఫీ దిగిన కొడుకు

see this –  నాకు కరోనా సోకలేదు..ఆస్పత్రి నుంచి తప్పించుకున్న పేషెంట్

see this – ట్రీట్మెంట్ పేరుతో యువతిపై డాక్టర్ లైంగిక వేధింపులు