చెన్నైని ఢీకొట్టేదెవరు?.. క్వాలిఫయర్‌‌–2లో ముంబై vs గుజరాత్‌‌

చెన్నైని ఢీకొట్టేదెవరు?.. క్వాలిఫయర్‌‌–2లో ముంబై vs గుజరాత్‌‌
  • చెన్నైని ఢీకొట్టేదెవరు?
  • నేడు క్వాలిఫయర్‌‌–2లో ముంబై vs గుజరాత్‌‌
  • సూపర్‌‌ జోష్‌‌లో రోహిత్‌‌సేన.. ఒత్తిడిలో హార్దిక్‌‌ బృందం

    
అహ్మదాబాద్‌‌:  డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌ గుజరాత్‌‌ టైటాన్స్‌‌.. ఐదుసార్లు చాంపియన్‌‌ ముంబై ఇండియన్స్‌‌.. ఐపీఎల్‌‌–16లో క్వాలిఫయర్‌‌–2కు రెడీ అయ్యాయి. ఫైనల్‌‌కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌‌ కావడంతో శుక్రవారం జరిగే ఈ పోరు కోసం ఇరుజట్లు తమ అస్త్రాలకు మరింత పదును పెట్టుకుంటున్నాయి. తొలి క్వాలిఫయర్‌‌లో చెన్నై చేతిలో చిత్తయిన గుజరాత్‌‌ ఈ మ్యాచ్‌‌లో పాత తప్పులను రిపీట్‌‌ చేయకూడదని భావిస్తుంటే.. ముంబై నయా హీరో ఆకాశ్‌‌ మద్వాల్‌‌ మరో సంచలన పెర్ఫామెన్స్‌‌ కోసం వేచి చూస్తున్నాడు. ఓవరాల్‌‌గా బలమైన ఆల్‌‌రౌండర్లతో కూడిన ఇరుజట్ల మధ్య రసవత్తర పోరు జరగడం ఖాయం. ఒక్క ఓవర్‌‌తో రిజల్ట్‌‌ తారుమారు అయ్యే టీ20ల్లో ఫేవరెట్‌‌ను అంచనా వేయడం కష్టంగా మారిన తరుణంలో చెన్నైని ఢీకొట్టేది ఎవరో చూడాలి.   

జోరు కొనసాగేనా?

ఎలిమినేటర్‌‌ విజయంతో ముంబైలో జోరు పెరిగింది. బ్యాటింగ్‌‌లో ఫెయిలైనా.. బౌలింగ్‌‌లో రాణించడం టీమ్‌‌లో ఆత్మవిశ్వాసాన్ని బాగా పెంచింది. అయితే గుజరాత్‌‌పై నెగ్గాలంటే ఈ జోరును మరింత కొనసాగించాలి. స్టార్టింగ్‌‌లో ఇషాన్‌‌, రోహిత్‌‌ మెరుగైన ఆరంభం ఇస్తే భారీ స్కోరు ఖాయం. గ్రీన్‌‌, సూర్యకుమార్‌‌, తిలక్‌‌ వర్మ, టిమ్‌‌ డేవిడ్‌‌ ముంబై బ్యాటింగ్‌‌కు వెన్నెముకగా ఉన్నారు. వీళ్లలో ఏ ఇద్దరు కుదురుకున్నా ఈజీగా రెండు వందల టార్గెట్‌‌ను ఆశించొచ్చు. ముంబై బ్యాటర్లను నిలువరించాలంటే షమీతో కూడిన టైటాన్స్‌‌ బౌలింగ్ బృందం శక్తికి మించి పోరాడాలి. ఇంపాక్ట్‌‌ ప్లేయర్‌‌ స్ట్రాటజీలో భాగంగా ముంబై ఎక్స్‌‌ట్రా బ్యాటర్‌‌తోనే బరిలోకి దిగొచ్చు. ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌ చేస్తే మాత్రం కచ్చితంగా నెహాల్‌‌ వదేరాను ఉపయోగించుకోవచ్చు. లేదంటే సూర్యను ఇంపాక్ట్‌‌గా వాడుకోవచ్చు. ఇక బౌలింగ్‌‌లో జోర్డాన్‌‌, బెరెన్‌‌డార్ఫ్‌‌కు తోడుగా ఇప్పుడు నయా సంచలనం ఆకాశ్‌‌ మద్వాల్‌‌పై అందరి కళ్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌‌లోనూ అతను కచ్చితంగా ప్రభావం చూపిస్తాడని అంచనా వేస్తున్నారు. ఆరంభంలో జీటీ ఓపెనర్లను ఆపగలిగితే ముంబై విజయావకాశాలు చాలా మెరుగవుతాయి. స్పిన్నర్లుగా చావ్లా, కుమార్‌‌ కార్తికేయను తీసుకోవచ్చు. పిచ్‌‌ను బట్టి ఎక్స్‌‌ట్రా పేసర్‌‌ను ఆడించే చాన్స్‌‌ కూడా ఉంది. 

క్వాలిఫయర్‌‌–1లో సీఎస్కే చేతిలో ఓడటంతో గుజరాత్‌‌పై ఒత్తిడి నెలకొంది. దీంతో క్వాలిఫయర్‌‌–2 చావో రేవో మ్యాచ్‌‌ కావడంతో గెలుపే లక్ష్యంగా జీటీ బరిలోకి దిగుతున్నది. బాగా అలవాటు పడిన కండీషన్స్‌‌లో ముంబైకి షాకిచ్చి వరుసగా రెండోసారి ఫైనల్లోకి అడుగుపెట్టాలని బలంగా ప్రయత్ని స్తోంది. ఇది జరగాలంటే ఓపెనింగ్‌‌లో శుభ్‌‌మన్‌‌ గిల్‌‌, ముగింపులో విజయ్‌‌ శంకర్‌‌ బ్యాట్లు ఝుళిపించాలి. గత కొన్ని మ్యాచ్‌‌ల్లో ఈ ఇద్దరి ఆటతోనే జీటీ గట్టెక్కింది. సీఎస్కే మ్యాచ్‌‌లో తేలిపోయిన గిల్‌‌ భారీ ఇన్నింగ్స్‌‌ను ఆశిస్తున్నాడు. 15 మ్యాచ్‌‌ల్లో రెండు సెంచరీలతో 722 రన్స్‌‌ చేసిన అతను మరో హండ్రెడ్‌‌ కోసం వెయిట్‌‌ చేస్తున్నాడు. శంకర్‌‌ కూడా 12 మ్యాచ్‌‌లో 301 రన్స్‌‌తో మంచి ఫామ్‌‌లో ఉన్నాడు. ఈ ఇద్దరితో పాటు కెప్టెన్‌‌ హార్దిక్‌‌ కూడా ఓ చేయి వేస్తే జీటీ విజయం మరింత ఈజీ అవుతుంది. లోయర్‌‌ మిడిలార్డర్‌‌లో డేవిడ్‌‌ మిల్లర్‌‌, రాహుల్‌‌ తెవాటియా ఫినిషింగ్‌‌ కూడా ఇంపార్టెంట్‌‌. ప్రతి మ్యాచ్‌‌లో హైలెట్‌‌ అవుతున్న రషీద్‌‌ ఖాన్‌‌ బ్యాటింగ్‌‌ మెరుపులు ఇందులో కొనసాగించాలి. బౌలింగ్‌‌లో మోహిత్‌‌ శర్మ, షమీకి తోడుగా రషీద్‌‌, నూర్‌‌ అహ్మద్‌‌ మ్యాజిక్‌‌ చేస్తే ముంబై భారీ స్కోరును అడ్డుకోవచ్చు.

జట్లు (అంచనా)

ముంబై: రోహిత్‌‌ (కెప్టెన్‌‌), ఇషాన్‌‌ కిషన్‌‌, కామెరూన్‌‌ గ్రీన్‌‌, సూర్యకుమార్‌‌, తిలక్‌‌ వర్మ, టిమ్‌‌ డేవిడ్‌‌, హ్రితిక్‌‌ షోకీన్‌‌ / నెహాల్‌‌ వదేరా, క్రిస్‌‌ జోర్డాన్‌‌, పీయూష్‌‌ చావ్లా, బెరెన్‌‌డార్ఫ్‌‌, ఆకాశ్‌‌ మద్వాల్‌‌, కుమార్‌‌ కార్తికేయ.
గుజరాత్‌‌: హార్దిక్‌‌ (కెప్టెన్‌‌), శుభ్‌‌మన్‌‌ గిల్‌‌, సాహా, విజయ్‌‌ శంకర్‌‌, డేవిడ్‌‌ మిల్లర్‌‌, సాయి సుదర్శన్‌‌ / అభినవ్‌‌ మనోహర్‌‌, రాహుల్‌‌ తెవాటియా, రషీద్‌‌ ఖాన్‌‌, నూర్‌‌ అహ్మద్‌‌, జోష్‌‌ లిటిల్‌‌ / యష్‌‌ దయాల్‌‌, మోహిత్‌‌ శర్మ, షమీ.