స్కూళ్లకు నాణ్యమైన బియ్యం అందించాలి : హెచ్ఎంలు

స్కూళ్లకు నాణ్యమైన బియ్యం అందించాలి : హెచ్ఎంలు

నేరడిగొండ, వెలుగు: మధ్యాహ్న భోజనం కోసం నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని నేరడిగొండ మండంలోని పలు స్కూళ్ల హెచ్​ఎంలు కోరారు. తహసీల్దార్ ​ఖలీంను శుక్రవారం కలిసి స్కూల్ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. మధ్యాహ్న భోజనం కోసం స్కూళ్లకు అందించే  బియ్యం సరిగ్గా ఉండడం లేదని, పురుగు పట్టి ఉంటున్నాయని తెలిపారు. 

నాణ్యమైన బియ్యం అందించి, విద్యార్థుల ఆరోగ్యానికి కృషి చేయాలని కోరారు. అదేవిధంగా స్కూల్ పాయింట్ కు బియ్యాన్ని అందించేలా చూడాలని కోరారు. టీచర్లు, తదితరులు  పాల్గొన్నారు.