కలెక్టరేట్ల ఎదుట క్యూ.. గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌కు తరలివచ్చిన బాధితులు

కలెక్టరేట్ల ఎదుట క్యూ.. గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌కు తరలివచ్చిన బాధితులు

హనుమకొండ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌, వెలుగు :  కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌కు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. హనుమకొండ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో కలెక్టర్‌‌‌‌‌‌‌‌ సిక్తా పట్నాయక్‌‌‌‌‌‌‌‌, అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ మహేందర్‌‌‌‌‌‌‌‌, డీఆర్డీవో శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌కు హాజరై అర్జీలు తీసుకున్నారు. వివిధ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లకు సంబంధించి మొత్తం 114 అర్జీలు వచ్చాయి. వాటిని ఆయా శాఖలకు పంపించి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఆదేశించారు. కాగా సర్కార్‌‌‌‌‌‌‌‌ స్కూళ్లు, కాలేజీలు, హాస్టల్స్‌‌‌‌‌‌‌‌లోకి విద్యార్థి సంఘాలు, మీడియాను రానివ్వొద్దంటూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలంటూ ఏఐఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ నాయుకలు కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు వినతిపత్రం ఇచ్చారు 

ప్రజావాణి అర్జీలకు ప్రయారిటీ ఇవ్వాలి

భూపాలపల్లి అర్బన్‌‌‌‌‌‌‌‌, వెలుగు : ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు ప్రయారిటీ ఇచ్చి త్వరగా పరిష్కరించాలని భూపాలపల్లి కలెక్టర్‌‌‌‌‌‌‌‌ భవేశ్‌‌‌‌‌‌‌‌ మిశ్రా ఆదేశించారు. కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ప్రజావాణికి ఆయన హాజరై అర్జీలు తీసుకున్నారు. మొత్తం 35 వినతిపత్రాలు వచ్చినట్లు కలెక్టర్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. అర్జీలు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో పడకుండా చూడాలన్నారు.

జనగామలో 45, ములుగులో 71

జనగామ అర్బన్‌‌‌‌‌‌‌‌/ములుగు, వెలుగు : జనగామ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌, ములుగులో అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ వేణుగోపాల్‌‌‌‌‌‌‌‌ ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నారు. జనగామలో 45, ములుగులో 71 అర్జీలు వచ్చినట్లు వారు తెలిపారు. తిరస్కరించిన అర్జీలకు సంబంధించి సంబంధిత వ్యక్తులకు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. జనగామలో జడ్పీ సీఈవో వసంత, సీపీవో ఇస్మాయిల్, డీవీహెచ్‌‌‌‌‌‌‌‌వో మనోహర్, ఎన్పీడీసీఎల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ వేణుమాధవ్, డీఏవో వినోద్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, ములుగులో జడ్పీ సీఈవో ప్రసూణరాణి, సీపీవో ప్రకాశ్‌‌‌‌‌‌‌‌, డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో అప్పయ్య పాల్గొన్నారు.

వరంగల్‌‌‌‌‌‌‌‌ బల్దియాలో...

వరంగల్‌‌‌‌‌‌‌‌ సిటీ, వెలుగు : బల్దియా హెడ్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ అనిసుర్‌‌‌‌‌‌‌‌ రషీద్‌‌‌‌‌‌‌‌ ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నారు. ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి 17, హెల్త్‌‌‌‌‌‌‌‌, శానిటేషన్‌‌‌‌‌‌‌‌ 2, ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ 4, టౌన్‌‌‌‌‌‌‌‌ ప్లానింగ్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి 33, మొత్తం 56 అర్జీలు వచ్చినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌వో పాపయ్య, 
సీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో రాజేశ్‌‌‌‌‌‌‌‌, సీహెచ్‌‌‌‌‌‌‌‌వో శ్రీనివాసరావు, సిటీ ప్లానర్‌‌‌‌‌‌‌‌ వెంకన్న, సెక్రటరీ విజయలక్ష్మి, బయాలజిస్ట్‌‌‌‌‌‌‌‌ మాధవరెడ్డి పాల్గొన్నారు. 

పోలీసులు పారదర్శకంగా వ్యవహరించాలి

భూపాలపల్లి అర్బన్‌‌‌‌‌‌‌‌, వెలుగు : ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీసులు పారదర్శకంగా వ్యవహరించాలని భూపాలపల్లి ఎస్పీ పుల్లా కరుణాకర్‌‌‌‌‌‌‌‌ ఆదేశించారు. సోమవారం ఎస్పీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ప్రజాదివస్‌‌‌‌‌‌‌‌ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. 

మొత్తం 16 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ తెలిపారు. ప్రతి అంశాన్ని చట్ట పరిధిలో పరిష్కరించాలని, బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేయాలని ఆదేశించారు. చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తూ, లా అండ్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌కు ఇబ్బందులు కలిగించే వారి పట్ల, మహిళలపై దాడులు చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.