తడబడ్డ ముంబై..చెలరేగిన హైదరాబాద్ బౌలర్లు

తడబడ్డ ముంబై..చెలరేగిన హైదరాబాద్ బౌలర్లు

ముంబై : హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 రన్స్ చేసింది. ముంబైకు మంచి ప్రారంభం దక్కింది. అయితే పవర్ ప్లేలో కెప్టెన్ రోహిత్(24) ఔట్ కావడంతో స్కోర్ రన్ రేట్ తగ్గింది. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్, డికాక్ వేగంగా ఆడుతుండగా..ముంబై స్కోర్90 దగ్గర సూర్యకుమార్ యాదవ్ ఔట్ అయ్యాడు.

వెంటనే లెవిస్, హార్దిక్ పాండ్యా కూడా ఔట్ కావడంతో ముంబై దూకుడు తగ్గించింది. ముంబై భారీ స్కోర్ దిశగా ఆడుతున్న సమయంలో కట్టుదిట్టమైన బౌలింగ్ చేసింది హైదరాబాద్. రషీద్ ఖాన్ మరోసారి బౌలింగ్ కట్టుదిట్టమైన బౌలింగ్ వేశాడు. చివర్లో పొలార్డ్, డికాక్ ఆచితూచి ఆడటంతో గౌరవప్రధమైన స్కోర్ చేసింది ముంబై. ఈ క్రమంలోనే ఓపెనర్ డికాక్ హాఫ్ సెంచరీ చేసుకున్నాడు.

ముంబై ప్లేయర్లలో..రోహిత్ శర్మ(24), డికాక్(69), సూర్యకుమార్ యాదవ్(23), లెవిస్(1), హార్దిక్ పాండ్యా(18), పొలార్డ్(10), కృనాల్ పాండ్యా(9) రన్స్ చేశారు.

హైదరాబాద్ బౌలర్లలో..ఖలీల్(3), భువనేశ్వర్(1), నబీ(1) వికెట్లు తీశారు.