శాండ్ ఆర్ట్‌తో కోహ్లీ బొమ్మ గీసిన పాక్ వీరాభిమాని

శాండ్ ఆర్ట్‌తో కోహ్లీ బొమ్మ గీసిన పాక్ వీరాభిమాని

ఈ ఏడాది T–20 క్రికెట్​ ప్రపంచకప్​లో జరిగిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్​ గుర్తుండే ఉంటుంది. ఆ మ్యాచ్​లో కోహ్లీ ఆటతీరుకు ఫ్యాన్స్​ ఫిదా అయిపోయారు. కోహ్లీ ఫ్యాన్సే కాకుండా క్రికెట్​ చూసే అభిమానులంతా అతన్ని మెచ్చుకున్నారు.

అయితే, కోహ్లీకి మన దేశంలోనే కాదు.. ఇతర దేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్లు కూడా తమ అభిమానాన్ని వాళ్ల స్టైల్​లో ఎక్స్​ప్రెస్ చేశారు. వాళ్లలో ఒకరు ఆర్​.ఎ. గద్దాని. ఇతను పాకిస్తాన్​లోని బెలూచిస్తాన్​కు​ చెందినవాడు. ఇతనికి కోహ్లీ అంటే చాలా ఇష్టం.

తన ఫేవరెట్​ క్రికెటర్​ మ్యాచ్ గెలిపించడానికి పడిన కష్టానికి ఫిదా అయిపోయాడు. ఏదో ఒక రూపంలో తన అభిమానాన్ని చూపించాలనుకున్నాడు. ఆ ఆలోచనతో శాండ్​ ఆర్ట్​తో కోహ్లీ బొమ్మ గీశాడు. దానిపైన ‘లవ్​ ఫ్రమ్​ ఆర్​.ఎ. గద్దాని’ అని రాశాడు. ఆ పోస్ట్ చూసినవాళ్లంతా మరోసారి కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తారు. గద్దాని ఆర్ట్​ వర్క్​ని కూడా మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. అభిమానానికి ఎల్లలు ఉండవంటే ఇదే!