బ్రెవిస్ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ గురించే మాట్లాడా.. రేటు గురించి కాదు: అశ్విన్

బ్రెవిస్ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ గురించే మాట్లాడా..  రేటు గురించి కాదు: అశ్విన్

చెన్నై:  సౌతాఫ్రికా యంగ్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్ డెవాల్డ్‌‌‌‌‌‌‌‌ బ్రెవిస్‌‌‌‌‌‌‌‌ను  గత ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ లో  చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) రీప్లేస్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా  జట్టులోకి తీసుకోవడంపై తాను చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో టీమిండియా  సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వాటిపై క్లారిటీ ఇచ్చాడు. యూట్యూబ్ ఛానల్‌‌‌‌‌‌‌‌లో  బ్రెవిస్ బ్యాటింగ్ టాలెంట్‌‌‌‌‌‌‌‌ గురించి గురించి మాట్లాడటమే తన ఉద్దేశమని సీఎస్కే అతనికి చెల్లించిన డబ్బు గురించి కాదని  తేల్చి చెప్పాడు.  సీఎస్కే జట్టులోనే ఉన్న  అశ్విన్, ఇటీవల తన యూట్యూబ్ ఛానల్‌‌‌‌‌‌‌‌లో బ్రెవిస్‌‌‌‌‌‌‌‌ను తీసుకునేందుకు తమ జట్టు అదనపు మొత్తం చెల్లించడానికి సిద్ధపడిందని వ్యాఖ్యానించాడు. దీనిపై వివాదం మొదలవడంతో సీఎస్కే ఫ్రాంఛైజీ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.  నిబంధనల మేరకే బ్రెవిస్‌‌‌‌‌‌‌‌ను తమ టీమ్‌‌‌‌‌‌‌‌లోకి తీసుకున్నామని చెప్పింది. ఈ నేపథ్యంలో అశ్విన్ తన కామెంట్లపై  స్పందించాడు. ‘ ఆ పాత వీడియోలో నేను  బ్రెవిస్ బ్యాటింగ్ గురించి మాత్రమే మాట్లాడాలనుకున్నాను.  

ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో అతనికి ఇచ్చిన ధర గురించి కాదు. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో ఆడే ప్రతి ఆటగాడికి ఫ్రాంఛైజీతో, టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌తో ఒక ఒప్పందం ఉంటుందని అందరూ అర్థం చేసుకోవాలి.  కాబట్టి ఏదైనా నిబంధనలకు విరుద్ధంగా జరిగితే దానికి ఆమోదం లభించదు’ అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నాడు. గత సీజన్ ఐపీఎల్ వేలంలో సీఎస్కే గుర్జప్‌‌‌‌‌‌‌‌నీత్ సింగ్‌‌‌‌‌‌‌‌ను రూ. 2.2 కోట్లకు కొనుగోలు చేయగా.. అతను గాయపడటంతో రీప్లేస్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఆ స్థానాన్ని  బ్రెవిస్‌‌‌‌‌‌‌‌తో భర్తీ చేసింది. ఈ క్రమంలో బ్రెవిస్ కోసం రూ.2.2 కోట్ల కంటే ఎక్కువ చెల్లించేందుకు సీఎస్కే సిద్ధంగా ఉందని అశ్విన్ పేర్కొన్నాడు. కానీ, తాము నిబంధనల మేరకు అంతే మొత్తంతో సౌతాఫ్రికా యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకున్నామని సీఎస్కే  స్పష్టం చేసింది. అయితే, ఈ ప్రక్రియలో  ఫ్రాంఛైజీ, ప్లేయర్, ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ గవర్నింగ్ కౌన్సిల్ ఎలాంటి పొరపాటు చేయలేదని అశ్విన్ తన తాజా వీడియోలో చెప్పాడు. 

బ్రెవిస్ స్పెషల్ టాలెంట్‌‌‌‌‌‌‌‌

బ్రెవిస్ ఒక  స్పెషల్ టాలెంట్ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని అశ్విన్ అభివర్ణించాడు. ‘ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో గాయపడిన ఆటగాళ్లకు బదులుగా కొత్తవారిని తీసుకోవడం కామన్‌‌‌‌‌‌‌‌. అయితే, నిబంధనలకు లోబడి ఇలాంటి అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకుంటాం అనేది ముఖ్యం. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. సీఎస్కే, సౌతాఫ్రికా అభిమానులందరూ బ్రెవిస్ ఆటను చూసి సంతోషపడాలి. ఎందుకంటే అతను ఒక అసాధారణ ప్రతిభావంతుడు’ అని అశ్విన్ అన్నాడు. బ్రెవిస్‌‌‌‌‌‌‌‌ను  తీసుకోవడం ద్వారా సీఎస్కేకు చాలా లాభం జరిగిందని అన్నాడు. ‘బ్రెవిస్ బ్యాటింగ్ చేస్తున్న తీరు చూస్తుంటే సీఎస్కేకు గోల్డెన్ చాన్స్ లభించింది. అతడిని జట్టులోకి తీసుకోవడం చాలా మంచి నిర్ణయం. బ్రెవిస్ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాడు. చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. భారీ సిక్సర్లు కొడుతున్నాడు. స్పిన్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో తను పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ హిట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అని అశ్విన్ ప్రశంసించాడు.