బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలె

బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలె
  • రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్

మెహిదీపట్నం,వెలుగు: బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు పార్లమెంటు సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని రాష్ట్ర బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. మెహిదీపట్నంలోని విద్యుత్ ఆఫీసులో బుధవారం జరిగిన రాష్ట్ర విద్యుత్ బీసీ ఉద్యోగుల సంఘం సమావేశం జరిగింది.  విద్యుత్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కుమారస్వామి, వెంకన్న గౌడ్ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీల ఉద్యమానికి బీసీ ఉద్యోగులు నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు.  బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టడానికి చట్టపరమైన, రాజ్యాంగ, న్యాయపరమైన అడ్డంకులు లేవన్నారు. కార్యక్రమంలో   విద్యుత్ బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు పి. యాదగిరి, చంద్రుడు తదితరులు పాల్గొన్నారు.


వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలె
ముషీరాబాద్: రాష్ట్రంలో బీసీలుగా ఉన్న వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యానగర్​లోని బీసీ భవన్​లో వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు వేముల వెంకటేశ్ ఆధ్వర్యంలో ఆర్. కృష్ణయ్యను ఘనంగా సన్మానించారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ.. వడ్డెరలు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకలో ఎస్టీ జాబితాలో ఉన్నారని  తెలంగాణలోనే బీసీలుగా ఉన్నారన్నారు. వడ్డెరలను ఎస్టీ జాబితాలోకి చేర్చే విషయమై సీఎం కేసీఆర్​ను కలిసి మాట్లాడుతానన్నారు. బీసీ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.