ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి : ఆర్.కృష్ణయ్య

ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి : ఆర్.కృష్ణయ్య
  • బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: కాలేజీ విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సుమారు 14 లక్షల మంది స్టూడెంట్స్​కు రూ.8 వేల కోట్ల ఫీజు బకాయిలు ఉన్నాయని తెలిపారు. శనివారం బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీశ్, నిరుద్యోగ జేఏసీ నేత నీల వెంకటేశ్​ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు భారీగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలకు సొంత భవనాలు లేవని పేర్కొన్నారు. వెంటనే 119 బీసీ గురుకులాలు, 100 బీసీ కాలేజ్ హాస్టళ్లను మంజూరు చేసి గురుకుల పాఠశాలల్లో 20 శాతం సీట్లు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్కాలర్​షిప్‌‌, ఫీజు రీయింబర్స్​మెంట్​ చెల్లించకపోవడం వల్ల పేదల విద్య మధ్యలోనే ఆగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అనంతయ్య, శివకుమార్ యాదవ్, మోడీ రాందేవ్, అఖిల్ ముదిరాజ్, హరీశ్​ తదితరులు పాల్గొన్నారు.