- ఎన్సీబీసీ చైర్మన్కు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రంలో బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య కోరారు. బీసీల సంక్షేమానికి రెండు లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించి ఆర్థిక, విద్య, ఉద్యోగ, శిక్షణ, అభివృద్ధికి చర్యలు తీసుకునేలా సిఫారసు చేయాలన్నారు. బుధవారం ఢిల్లీలో ఆర్.కృష్ణయ్య నేతృత్వంలోని బీసీ నేతల బృందం జాతీయ బీసీ కమిషన్(ఎన్సీబీసీ) చైర్మన్ సాధ్వి నిరంజన్ జ్యోతిని కలిసి వినతి పత్రం అందించింది.
పారిశ్రామికీకరణ, యాంత్రీకరణ కారణంగా కులవృత్తులు, చేతివృత్తులు దెబ్బతిని, వాటిపై ఆధారపడిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆయా కుటుంబాలను ఆదుకునేందుకు రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని విన్నవించారు.
