బీసీ రిజర్వేషన్లను కూడా జనాభా ప్రకారం పెంచాలె

బీసీ రిజర్వేషన్లను కూడా జనాభా ప్రకారం పెంచాలె
  • ఎస్టీ రిజర్వేషన్లలాగే బీసీలకూ పెంచాలె
  • ఆర్​.కృష్ణయ్య డిమాండ్‌

ముషీరాబాద్, వెలుగు: గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి10 శాతానికి పెంచడం సంతోషకరమని, అలాగే బీసీ రిజర్వేషన్లను కూడా జనాభా ప్రకారం 25 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్​లోని బీసీ భవన్​లో జరిగిన14 బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లను పెంచేందుకు ప్రభుత్వానికి చట్టపరమైన, న్యాయపరమైన, రాజ్యాంగపరమైన ఇబ్బందులు ఏమీ లేవన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్యా, ఉద్యోగాలలో జనాభా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని రాజ్యాంగంలో స్పష్టంగా ఉందన్నారు. ఎవరి జనాభా ప్రకారం వారికి రిజర్వేషన్లు కల్పించడానికి రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించారని చెప్పారు. జనాభా లెక్కలు శాస్త్రీయంగా ఉంటే జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచుకోవచ్చన్నారు.