కార్పొరేట్ విద్యా సంస్థలను నిషేదించాలె: ఆర్ కృష్ణయ్య

కార్పొరేట్ విద్యా సంస్థలను నిషేదించాలె: ఆర్ కృష్ణయ్య

కార్పొరేట్ విద్యా సంస్థలను నిషేదించాలి, ఒకే పేరుతో ఒకే కళాశాలకు అనుమతి కల్పించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యానగర్ లోని బీసీ భవన్ లో రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. గత ఎన్నో ఏండ్లుగా విద్యార్థుల సమస్యలతో పోరాడి పరిష్కరించమని తెలిపారు. కాబట్టి మీలో నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని బీసీ సంఘం నాయకులు, విద్యార్థులకు సూచించారు. బీసీ కాలేజీ హాస్టళ్లకు సొంత భవనాలను నిర్మించాలన్నారు. 

కాలేజీ స్థాయిలోని బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజుల స్కీం పునరుద్ధరించాలని ఆర్ కృష్ణయ్య చెప్పారు. విదేశీ విద్యను అప్లై చేసిన ప్రతీ విద్యార్థికి అనుమతి ఇవ్వాలి..విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇటీవల మంత్రివర్గ ఉపసంఘం హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను 25% పెంచాలని నిర్ణయం తీసుకుంది. కానీ 100% ధరలు పెరిగితే 25% పెంచడంలో ఏమైనా న్యాయం ఉందా అని ప్రశ్నించారు. ఎస్సి ఎస్టి, బీసీ కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను నెలకు 1500 నుండి 3 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.