- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను వేలం వేస్తే ఊరుకునేది లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. హాస్టళ్లు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో విద్యార్థులతో కలిసి భారీ ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములు ప్రజా అవసరాలకు ఉపయోగించాలని కోరారు. గతంలో కేసీఆర్ సర్కార్ భూములను అమ్మేందుకు ప్రయత్నిస్తే అడ్డుకున్నామని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలతో పాటు హాస్టళ్లు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గుజ్జ సత్యం, రాజేందర్, అనంతయ్య, మోడీ రాందేవ్పా ల్గొన్నారు.
