సెన్సార్ బోర్డు సభ్యుడిగా శ్రీహరి తమ్ముడు శ్రీధర్

సెన్సార్ బోర్డు సభ్యుడిగా శ్రీహరి తమ్ముడు శ్రీధర్

ప్రాంతీయ సెన్సార్ బోర్డు (సెంట్రల్ బోర్డు అఫ్ ఫిలిం సర్టిఫికేషన్) హైదరాబాద్ రీజియన్ సభ్యుడిగా ఆర్.శ్రీధర్ ను కేంద్ర ప్రభుత్వం నియమిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. రియల్ స్టార్ శ్రీహరి తమ్ముడైన శ్రీధర్ నటుడిగా వంద సినిమాలకు పైగా చేయడంతో పాటు నిర్మాతగా పలు సినిమాలు చేశారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. తనకు లభించిన ఈ పదవికి పూర్తి న్యాయం చేకూరుస్తానని శ్రీధర్ వెల్లడించారు.

కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సెన్సార్ బోర్డు చైర్ పర్సన్ కు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు, నిర్మాతలు నట్టి కుమార్, జేవీ మోహన్ గౌడ్ తదితరులు శ్రీధర్ కు శుభాకాంక్షలు తెలిపారు.