గణేష్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి

గణేష్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి

వినాయక నిమజ్జనంను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ సూచించారు. నాచారం, మల్లాపూర్ లోని వీఎన్ఆర్ గార్డెన్లో రాచకొండ కమిషనరేట్​ పరిధిలోని వివిధ ఠాణాల పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు.  గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన చేసిన నిర్వహకులు పోలీసులకు సహకరించాలని అన్నారు. గణేష్ నిమజ్జనం శుక్రవారం జరుగుతుండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

గణేష్ వేడుకల్లో భాగంగా ఎక్కడా సమస్య రానివ్వకూడదని, ఈ విషయంలో పోలీసులతో పాటు అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు.గణేష్ నిమజ్జనం అంతా ముందు ప్రణాళికగా జరగాలని ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని కమిషనర్ తెలిపారు. ఆయా ప్రాంతాల ప్రజలతో సమన్వయం చేసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. మల్కాజ్గిరి పరిధిలోని చెరువుల వద్ద నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మహేష్ భగవత్ తెలిపారు.