Virat Kohli: ఎయిర్ పోర్ట్‌లో చుట్టుముట్టిన ఫ్యాన్స్.. కార్ ఎక్కడానికి నానా ఇబ్బందులు పడిన కోహ్లీ.. వీడియో వైరల్

Virat Kohli: ఎయిర్ పోర్ట్‌లో చుట్టుముట్టిన ఫ్యాన్స్.. కార్ ఎక్కడానికి నానా ఇబ్బందులు పడిన కోహ్లీ.. వీడియో వైరల్

టీమిండియా మాజీ కెప్టెన్.. రన్ మెషీన్ విరాట్ కోహ్లీని ఎయిర్ పోర్ట్ లో ఫ్యాన్స్ గుమ్మిగూడారు. న్యూజిలాండ్ మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా టీమిండియా తొలి వన్డే ఆదివారం (జనవరి 11) ఆడనుంది. వడోదర వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా మాజీ కెప్టెన్.. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ వడోదర ఎయిర్ పోర్ట్ చేరుకున్నాడు. తొలి వన్డే కోసం బుధవారం (జనవరి 7) కోహ్లీ ఎయిర్ పోర్ట్ చేరుకున్న వెంటనే ఫ్యాన్స్ గుమ్మిగూడారు. కోహ్లీని చూడడానికి వచ్చిన అభిమానులు పెద్ద ఎత్తున చుట్టుముట్టారు. ఈ టీమిండియా మాజీ కెప్టెన్ ను 'కోహ్లీ, కోహ్లీ' అని నినాదాలు చేస్తూ వందలాది మంది సందడి చేశారు. 

కఠినమైన భద్రత ఉన్నప్పటికీ కోహ్లీ కార్ ఎక్కడానికి ఇబ్బంది పడ్డాడు. టెర్మినల్ నుండి బయటకు వెళ్లినప్పుడు ఫ్యాన్స్ అతనిని చూడటానికి పరుగెత్తడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. చివరికి కోహ్లీ తన కారు దగ్గరకు సేఫ్ గా సెక్యూరిటీ సహాయం అవసరమైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోహ్లీతో పాటు టీమిండియా ఆల్ రౌండర్ నితీష్ రెడ్డి కూడా వడోదరకు చేరుకున్నాడు. త్వరలోనే జట్టంతా వడోదరకు చేరుకోనుంది. తొలి వన్డే కోసం కోహ్లీ సిద్ధమవుతున్నాడు. ఇటీవలే విజయ్ హజారే ట్రోఫీ ఆడిన కోహ్లీ రెండు మ్యాచ్ లాడి ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ చేశాడు. 

దాదాపు 15 ఏండ్ల  తర్వాత తొలిసారి విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాపై వరుస సెంచరీలో చేలరేగిన తర్వాత తన సూపర్ ఫామ్‎ను ఇక్కడ కొనసాగించాడు. డిసెంబర్ 24 బెంగుళూరు వేదికగా ఏపీతో  జరిగిన మ్యాచులో కోహ్లీ శతకంతో చెలరేగాడు. తనకు ఎంతో ఇష్టమైన ఛేజింగ్‎లో సెంచరీ సాధించి ఢిల్లీకి ఘన విజయాన్ని అందించాడు. ఈ సెంచరీ లిస్ట్ ఏ క్రికెట్‎లోకి కోహ్లీకి 58వది. అలాగే.. ఈ మ్యాచులో విరాట్ మరో రికార్డ్ సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16 వేల పరుగులు పూర్తి చేసిన రెండో ఇండియన్ క్రికెటర్‎గా రికార్డుల్లోకెక్కాడు.

►ALSO READ | BBL 2025-2026: విజయానికి 6 బంతుల్లో 13 పరుగులు.. గెలిపిస్తావనుకుంటే ఇలా చేశావేంటి వార్నర్

ఈ జాబితాలో కోహ్లీ కంటే ముందు భారత క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఉన్నారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సచిన్ 21,999  పరుగులు చేసి తొలి స్థానంలో కొనసాగుతున్నారు. రెండో మ్యాచ్ లో గుజరాత్ పై కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. 61 బాల్స్‌‌‌‌లో 13 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 77 పరుగులు చేశాడు. చాలా ఏండ్ల తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడినప్పటికీ.. నేషనలైనా.. ఇంటర్నేషలైనా మాకు సంబంధంలే అన్నట్లు చెలరేగి ఆడాడు. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో ఉన్న కోహ్లీ.. ఈ సిరీస్ లో బాగా ఆడితే రోహిత్ ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకోవచ్చు.