హైదరాబాద్లో ఏసీబీ రైడ్స్.. రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్

హైదరాబాద్లో ఏసీబీ రైడ్స్.. రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్

అవినీతి నిరోధక శాఖ అధికారులు (ఏసీబీ) బుధవారం (జనవరి 07) పలు చోట్ల నిర్వహించిన రైడ్స్ లో అధికారులను రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. హైదరాబాద్ బాగ్ అంబర్ పేట్ లో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ను అక్కవరపు కిరణ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. 

బాగ్ అంబర్ పేట్ లోని దేవాదాయ శాఖ తరపున భూమికి చెందిన సర్వే రిపోర్ట్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడి ఫిర్యాదు మేరకు నిఘా ఉంచి పట్టుకున్నారు. బాధితుడి నుంచి లక్షా 50 వేలు డిమాండ్ చేసి.. ముందుగా 50 వేల రూపాయలు తీసుకుంటుండగా  పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.

రంగారెడ్డి జిల్లాలో ఎంపీడీవో, ఎంపీవో, పంచాయతీ సెక్రెటరీ:

రంగారెడ్డి జిల్లా  నందిగామ మండలంలో ఒకేసారి ఎంపీడీవో, ఎంపీవో, పంచాయతీ సెక్రెటరీలు లంచం తీసుకుంటూ పట్టుబడటం సంచలనంగా మారింది. ఎంపీడివో సుమతి, ఎంపీఓ తేజ్ సింగ్, ఈదులపల్లి గ్రామ కార్యదర్శి చెన్నయ్య, ఓ భవన  నిర్మాణానికి సంబంధించి రూ. లక్ష రూపాయలు   తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.

►ALSO READ | మైనర్లతో ఆ బూతు ఇంటర్వ్యూలేంటి..? హైదరాబాద్లో ప్రముఖ యూట్యూబర్ అరెస్టు

శంషాబాద్, నందిగామ గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించి రూ. లక్ష లంచం తీసుకుంటుండగా పంచాయితీ సెక్రెటరీ, MPDO, MPO లను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఓ వ్యక్తి నుండి 2.5 లక్షల లంచం డిమాండ్ చేసిన అధికారులు.. మెుదట రూ.1.5 లక్షలు తీసుకుని.. బుధవారం మరో లక్ష రూపాయలు తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.