
ఎల్బీనగర్, వెలుగు: భూదాన్‌పోచంపల్లి వద్ద ఉన్న మూసీ నదిపై ఉన్న జూలూరు, సంగెం బ్రిడ్డిలను రాచకొండ సీపీ సుధీర్ బాబు బుధవారం పరిశీలించారు. వరద ఉధృతి పెరిగితే రహదారులను తాత్కాలికంగా మూసివేయాలని, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. సీపీ వెంట చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు మధుసూదన్, విజయ్ మోహన్ ఉన్నారు.