డబుల్ బెడ్ రూమ్స్ పేరుతో రూ. కోటికి పైగా వసూళ్లు.. వ్యక్తి అరెస్ట్

డబుల్ బెడ్ రూమ్స్ పేరుతో రూ. కోటికి పైగా వసూళ్లు.. వ్యక్తి అరెస్ట్

ప్రభుత్వ శాఖలో జాబ్స్ ,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి ని  పట్టుకున్నారు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. సుధాకర్ తో పాటు అతనికి సహకారించిన నాగరాజు, భీమయ్య లను అరెస్ట్ చేశామని తెలిపారు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్. రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా పని చేస్తున్న సుధాకర్..సీఎం ఓఎస్డీగా  పని చేస్తున్నట్లు ఫేక్ ఐడి కార్డ్ లు తయారు చేసుకున్నాడని చెప్పారు. అంతేకాదు నాగరాజు, భీమయ్య లను సెక్యూరిటీ గార్డు గా పెట్టుకొని ఫార్చూనర్ కార్లో తిరుగుతూ ఫేక్ గన్ తో అమాయకులను మోసం చేశాడన్నారు. ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు, పోలీస్ జాబ్స్ , డబుల్ బెడ్ రూమ్స్  ఇప్పిస్తానని మోసం చేశాడని చెప్పారు. 80 నుంచి 100 మందిని మోసం చేసి.. 3కోట్ల కు పైగా వసూలు చేశాడన్నారు. సుధాకర్ పై గతంలో సైబరాబాద్, రాచకొండ పరిధిలో కేసులు ఉన్నాయని తెలిపారు సీపీ.

నిందితుల దగ్గర నుంచి రూ.కోటి 30 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు సీపీ అంజనీ కుమార్. కోటి రూపాయల ఇంటి పేపర్లు, ఫార్చూనర్ కారు, డమ్మీ గన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రజలు ఇలాంటి మోసాలపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.