నకిలీ సర్టిఫికెట్లు తయారుచేస్తున్న ముఠా అరెస్ట్

నకిలీ సర్టిఫికెట్లు తయారుచేస్తున్న ముఠా అరెస్ట్

నకిలీ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణతో పాటు ఆంధ్ర, కర్ణాటక యూనివర్సిటీ ల ఫేక్ సర్టిఫికెట్లను తయారు చేస్తోంది ఈ ముఠా. ఈ కేసులో ప్రధాన సూత్రధారి రోహిత్ కుమార్ తో పాటు  మరో ముగ్గురుని అరెస్ట్ చేసినట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ, జేఎన్టీయూ, ఆచార్య నాగార్జున, కర్ణాటక, అన్న యూనివర్సిటీ, మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠ్ ఫేక్ యూనివర్సిటీల సర్టిఫికెట్స్ ఇష్యూ చేస్తున్నట్లు చెప్పారు. ఒక్క ఫేక్ సర్టిఫికేట్ కు ఈ ముఠా లక్ష వసూలు చేస్తున్నట్లు తెలిపారు.

శ్రీలక్ష్మి కన్సల్టెంట్ ద్వారా ఈ దందా కొనసాగిస్తున్నారని సీపీ వెల్లడించారు. లేని కాలేజీ పేర్లతో కూడా సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తున్నట్లు చెప్పారు. విదేశాలకు వెళ్లేవారే ఎక్కువగా ఈ సర్టిఫికెట్స్ తీసుకుంటున్నారని తెలిపారు. గత ఆరు నెలల నుండి ఈ దందా చేస్తున్నారని..ఇప్పటివరకు 20 సర్టిఫికెట్స్ ఇచ్చారని చెప్పారు. నిందితుల వద్ద నుండి నకిలీ సర్టిఫికెట్స్, ల్యాప్ టాప్స్, ప్రింటర్స్, మొబైల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.