రాచకొండ సీపీగా సుధీర్​బాబు బాధ్యతలు

రాచకొండ సీపీగా సుధీర్​బాబు బాధ్యతలు

మల్కాజిగిరి, వెలుగు: రాచకొండ పోలీస్ ​కమిషనర్ గా సుధీర్​బాబు నియమితులయ్యారు. బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే ఆయన నేరేడ్​మెట్ సీపీ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించారు. గతంలో రాచకొండ సీపీగా సుధీర్​బాబు అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇక్కడి నుంచి బదిలీ అయ్యారు.

బుధవారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా తిరిగి రాచకొండకు వచ్చారు. ఇప్పటి వరకు రాచకొండ సీపీగా ఉన్న డాక్టర్ తరుణ్​జోషి ఏసీబీ డైరెక్టర్​గా బదిలీ అయ్యారు.