డీపీలను మార్ఫింగ్ చేసి వేధింపులు

డీపీలను మార్ఫింగ్ చేసి వేధింపులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: మార్ఫింగ్ ఫొటోలతో వీబీఐటీ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విద్యార్థినులను వేధించిన నలుగురు పోకిరీలను రాచకొండ పోలీసులు శనివారం అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. వారి నుంచి సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్లు స్వాధీనం చేసుకుని, అందులోని డేటాను రికవరీ చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ గ్యాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వివరాలను శనివారం రాచకొండ సీపీ డీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చౌహాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్లడించారు. ఏపీలోని గుంటూరు జిల్లా కొర్రెపాడుకు చెందిన చొప్పర లక్ష్మీ గణేశ్(19), మేడ ప్రదీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(19) ఇద్దరూ క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు చదివారు. గణేశ్ తాడేపల్లిలోని ఓ హోటల్​లో వెయిటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నాడు. అక్కడే స్థానిక అంజిరెడ్డికాలనీకి చెందిన బాలం సతీశ్(20), అతని సోదరుడు చవల దుర్గాప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(19)తో పరిచయం ఏర్పడింది. కాగా గణేశ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టా, వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యువతుల ఫోన్ ​నంబర్లు సేకరించేవాడు. వీటిని ఈ నలుగురు షేర్ చేసుకునేవారు. తర్వాత ఆ నంబర్లకు కాల్, మెసేజ్​లు చేసి వేధించేవారు.

వీడియా కాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అసభ్యకర ఫొటోలు..

వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అమ్మాయిల డీపీలను సేకరించడం అలవాటుగా మార్చుకున్నారు. ఆ ఫొటోలను మార్ఫింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి బెదిరింపులకు పాల్పడేవారు. వారి పర్సనల్ డేటాను హ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేవారు.  అమ్మాయిల నంబర్లను వాట్సాప్​లో పలు గ్రూపుల్లో యాడ్ ​చేసేవారు. ఇలాగే వీబీఐటీ కాలేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి చెందిన ఓ యువతిని పరిచయం చేసుకుని, ఆమె ఫొటోను మార్ఫింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఆమె ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు కాలేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్ల నంబర్లను కలెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. వారు క్రియేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన వాట్సాప్​, ఇన్​స్టాగ్రామ్ గ్రూప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి.. వీడియా కాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అసభ్యకర ఫొటోలు పెడుతూ వేధించారు. దీంతో విద్యార్థినులు కాలేజ్ వార్డెన్ కు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఘట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేసర్ పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేశారు. సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రైమ్ పోలీసులతో కలిసి ఆ నలుగురు నిందితు
లను విజయవాడలో అరెస్ట్ చేశారు. సిటీకి తీసుకొచ్చి రిమాండ్​కు తరలించారు.