హైదరాబాద్ సిటీ, వెలుగు: హరే కృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 13న రాధా గోవింద రథయాత్ర నిర్వహించనున్నామని నిర్వాహకులు తెలిపారు. గండిపేట వై జంక్షన్ సమీపంలోని కృష్ణ గో సేవా మండల్ గోశాల నుంచి సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమవుతుందన్నారు.
5 గంటల నుంచి 7 గంటల మధ్య కోకాపేట ప్రాంతానికి చేరుకుంటుందని, అల్లూ స్టూడియోస్ – 7 హిల్స్ రోడ్ – రాజపుష్ప ఆత్రియా – గోల్డెన్ మైల్ రోడ్ మార్గంలో వెళ్లి రాత్రి 7 గంటలకు హెరిటేజ్ టవర్ చేరుకుంటుందని చెప్పారు.
అక్కడ కీర్తనలు, హరే కృష్ణ మూవ్‌మెంట్ హైదరాబాద్ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస ప్రభూజీ ఆధ్యాత్మిక ప్రవచనం ఉంటుందన్నారు. తర్వాత మహా హారతి, మహా ప్రసాద వితరణ ఉంటుందని చెప్పారు.

