
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ (ఓఎస్డీ) పొట్లపల్లి రాధాకిషన్‌రావుకు నాంపల్లి కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. తన తల్లి సరోజినీ దేవి (98) మరణాంతర కార్యక్రమాల కోసం కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. నాంపల్లి కోర్టు శుక్రవారం ఆయనకు జూన్ 10 నుంచి 14 వరకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం రాధాకిషన్ రావు చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. నాలుగు రోజుల క్రితం ఆయన తల్లి అంత్యక్రియల కోసం బెయిల్ పై స్వగ్రామం జనగామ జిల్లా చిలుపూర్ మండలం పల్లగుట్టకు వెళ్లారు.
వయోభారం, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సరోజినీ దేవి కొంతకాలంగా కరీంనగర్‌లో కుమార్తె వద్ద ఉంటున్నారు. పరిస్థితి విషమించడంతోఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లిని చూసేందుకు అనుమతించాలని రాధాకిషన్‌రావు కోరడంతో ఏప్రిల్‌లో కోర్టు ఆయనకు 4 గంటల ప్రత్యేక అనుమతి మంజూరు చేసింది. ఏప్రిల్ 21న ఆయన తల్లిని చూసివచ్చారు.