స్టార్ హీరోని పట్టేసిన ఫ్లాప్ డైరెక్టర్

స్టార్ హీరోని పట్టేసిన ఫ్లాప్ డైరెక్టర్

టాలీవుడ్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీని తీసిన ఒక డైరెక్టర్ తన తరువాతి సినిమా కోసం స్టార్ హీరోను పెట్టేశాడు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఆ డైరెక్టర్ మరెవరో కాదు. జిల్(Jil) మూవీ ఫేమ్ రాధకృష్ణ కుమార్(Radhakrishna kumar). మొదటి సినిమా జిల్ తో మంచి మార్కులు కొట్టేసిన ఈ డైరెక్టర్ తరువాతి సినిమాను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) తో సెట్ చేసుకున్నాడు. అదే రాధే శ్యామ్(Radhe shyam). భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాట్సర్ గా నిలిచింది. ఈ సినిమాకు దాదాపు రూ. 120 కోట్ల నష్టం వచ్చింది. 

ఈ ఫ్లాప్ తరువాత దాదాపు సంవత్సరం గ్యాప్ తీసుకున్న రాధకృష్ణ కుమార్.. ఎట్టకేలకు తన మూడో సినిమా చేయడం కోసం సిద్దమయ్యాడు. ఈ సినిమా కోసం తమిళ స్టార్ హీరో విశాల్(Vishal) ను ఒప్పించాడు. రాధకృష్ణ చెప్పిన కథ విశాల్ కు బాగా నచ్చిందట. దాంతో ఈ ప్రాజెక్ట్ కు వెంటనే ఓకే చెప్పాడని సమాచారం.

ప్రస్తుతం విశాల్ మార్క్ ఆంటోనీ(Mark Antony) సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత డిటెక్టీవ్(Detective) సీక్వెల్ చేయనున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత.. విశాల్, రాధకృష్ణ మూవీ ససెట్స్ పైకి వెళ్లనుంది. మరి ఈ సినిమా అయినా రాధకృష్ణ హిట్ ఇస్తుందా అనేది చూడాలి మరి.