కేంద్రం సాయం చేయందే ఫ్రీ కరెంట్ ఇస్తున్నారా?

కేంద్రం సాయం చేయందే ఫ్రీ కరెంట్ ఇస్తున్నారా?
  • కరెంట్ ఇచ్చి ఆడిట్ అడగటం తప్పా

బంగ్లాదేశ్ కంటే భార‌త‌ జీడీపీ త‌క్కువ‌గా ఉందన్న మంత్రి హరీశ్  వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తమ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ ఇస్తోందని చెప్పారు..అయితే దేశానికి 24 గంటలు కరెంట్ అందిస్తున్న దేశంగా భారత్ ను ప్రపంచ దేశాలు గుర్తించినట్లు 2017 లోనే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారని గుర్తు చేశారని అన్నారు. గూగుల్ లో సెర్చ్ చేస్తే తెలుస్తుందన్నారు. మీరు దీనికి యాడ్ చేసింది..ఉచితం అని మాత్రమేనని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం సాయం చేయకుంటే ఉచిత కరెంటు తెలంగాణ ప్రభుత్వం ఎక్కడి నుంచి ఇస్తోందో చెప్పాలన్నారు. దుబ్బాక ఎన్నికల సమయంలో రఘునందన్ రావు గెలిస్తే..మోటర్లకు మీటర్లు వస్తాయని అప్పుడు తప్పు ప్రచారని..ఎక్కడైనా ఒక్క మీటరు ఉందేమో చూపించాలని ప్రశ్నించారు. కరెంట్ ఇచ్చి ఆడిట్ అడగటం తప్పు ఎలా అవుతోందో హరీశ్ చెప్పాలన్నారు. కరెంట్ ఉత్పత్తికి సంబంధించి ఆడిట్ అడగవద్దా..దేనికైనా ఆడిట్ ఉండాలన్నారు. ఏ రాష్ట్రం దేనికి ఎంత కరెంట్ ఉపయోగించుకుంటుందో తెలుసుకోవలంటే ఆడిట్ అవసరమన్నారు. విద్యుత్ ఎంత ఉపయోగిస్తే..ఆ రాష్ట్రం అంత అభివృద్ధి చెందినట్లు అన్న హరీశ్ అన్నారు కదా.. తెలంగాణ ఎంత కరెంట్ ఉపయోగించుకుంటుందో దానికి బిల్లు చెల్లించండి అని అన్నారు రఘునందన్ రావు. 

ధనిక రాష్ట్రం కదా..ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. డీఎస్సీ ఎందుకు నిర్వహించలేకపోతున్నారు అని అన్నారు.