శంకరమ్మకు రాజ్యసభ సీటు ఇవ్వాలని కేసీఆర్ ను అడుగు: రఘునందన్ రావు

శంకరమ్మకు రాజ్యసభ సీటు ఇవ్వాలని కేసీఆర్ ను అడుగు: రఘునందన్ రావు
  • తర్వాత ఫూలే విగ్రహం గురించి మాట్లాడు: రఘునందన్

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో జ్యోతీరావు ఫూలే విగ్రహం పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేయడంపై బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. పదేండ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి బడుగులు, బలహీన వర్గాలు, దళితులు గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. ఫూలే విగ్రహం కోసం డిమాండ్ చేసే ముందు, తెలంగాణ అమరుడు శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మకు రాజ్యసభ సీటు ఇవ్వాలని ఫామ్హౌస్కు వెళ్లి మీ నాన్న కేసీఆర్ను అడగాలని కవితను కోరారు. శంకరమ్మకు రాజ్యసభ సీటు ఇచ్చి మీ పాపాలు కడుక్కోవాలన్నారు.